Pope Francis: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ .. వైద్యులు ఏం చెప్పారంటే ..

పోప్ ఫ్రాన్సిస్ అస్వస్థతకు గురికావటంతో గురువారం ఉదయం అపాయింట్‌మెంట్‌లు రద్దు చేసినట్లు వాటికన్ ప్రతినిధి చెప్పారు. కొద్దిరోజులు పోప్ ఫ్రాన్సిస్ వైద్యుల పర్యవేక్షలో ఉంటారని తెలిసింది.

Pope Francis: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ .. వైద్యులు ఏం చెప్పారంటే ..

Pope Francis

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్  (Pope Francis)  తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. బుధవారం రాత్రి సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ను గురువారం రోమ్‌ (Rome) లోని  జెమెల్లీ ఆస్పత్రి (Gemelli Hospital) కి తరలించారు. 86ఏళ్ల  పోప్ ఫ్రాన్సిస్‌ను పరీక్షించిన వైద్యులు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ (Respiratory infection) కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం.. కోవిడ్ -19 నిర్ధారణ కాలేదని, కేవలం శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా పోప్ ఫ్రాన్సిస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వైద్యులు వెల్లడించినట్లు వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ  (Matteo Broni) చెప్పారు.

Pope Francis: అర్థంపర్థంలేని ఈ యుద్ధాన్ని.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ సందేశం

ఫ్రాన్సిస్ అస్వస్థతకు గురికావటంతో గురువారం ఉదయం పోప్ అపాయింట్‌మెంట్‌లు రద్దు చేసినట్లు వాటికన్ ప్రతినిధి చెప్పారు. కొద్దిరోజులు పోప్ ఫ్రాన్సిస్ వైద్యుల పర్యవేక్షలో ఉంటారని తెలిసింది. గత ఏడాదికాలంగా దీర్ఘకాలిక మోకాలి నొప్పితో ఫ్రాన్సిస్ బాధపడుతున్నాడు. అతనికి వీల్‌చైర్ ఉపయోగించాల్సి వచ్చింది. గత సంవత్సరం జులైలో పోప్ ఫ్రావిన్స్ ఆఫ్రికా దేశాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే అతని అనారోగ్యా కారణాల దృష్ట్యా పర్యటన వాయిదా పడింది. ఆ సమయంలో పోప్ ఆరోగ్యం విషమించిందన్న ప్రచారం జరిగింది.

Pope Francis: ఆన్‭లైన్ పోర్నోగ్రఫీ దెయ్యం, మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాలంటూ పోప్ ఫ్రాన్సిస్ వార్నింగ్

పోప్ ఫ్రాన్సిస్ బుధవారం ఉదయం వాటికన్‌లో తనను కలిసేందుకు వచ్చిన విశ్వాసులను పలుకరిస్తూ, నవ్వుతూ ఉత్సాహంగా కనిపించారు. సాయంత్రంకు శ్వాసకోస వ్యాధుల సమస్య ఇబ్బంది పెట్టడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది ప్రారంభంలో పోప్ ప్రాన్సిస్ దక్షిణ సుడాన్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను సందర్శించాడు. ఈ నెలలో హంగేరిని సందర్శించాల్సి ఉంది.