Kovind-Hasina Meeting : బంగ్లాదేశ్ ప్రధానితో రాష్ట్రపతి కోవింద్ భేటీ

మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటన కోసం బుధవారం ఉదయం ఢాకా వెళ్లిన భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో.. ఆ దేశ ప్రధానమంత్రి షేక్​ హసీనా భేటీ అయ్యారు.

Kovind-Hasina Meeting : బంగ్లాదేశ్ ప్రధానితో రాష్ట్రపతి కోవింద్ భేటీ

Kovind (1)

Kovind-Hasina Meeting : మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటన కోసం బుధవారం ఉదయం ఢాకా వెళ్లిన భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో.. ఆ దేశ ప్రధానమంత్రి షేక్​ హసీనా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరుపక్షాలు చర్చించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. 1971 నాటి విముక్తి పోరాటం స్ఫూర్తిని ఇద్దరు నేతలు గుర్తు చేసుకున్నారని, మైత్రి దివస్​ను సంయుక్తంగా నిర్వహించటంపై సంతృప్తి వ్యక్తం చేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్​ బాగ్చి తెలిపారు.

అంతకు ముందు రాష్ట్రపతి కోవింద్​తో బంగ్లాదేశ్​ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్​ మోమెన్​ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయాలని పునరుద్ఘాటించినట్లు ట్వీట్​ చేసింది ఆ దేశ విదేశాంగ శాఖ. డిసెంబర్​ 17 వరకు ఆ దేశంలో పర్యటించనున్నారు కోవింద్. బంగ్లాదేశ్​ 50వ విజయ్​ దివాస్​లో కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. భారత త్రివిధ దళాలకు చెందిన 122 మంది సభ్యుల కంటింజెంట్‌ కూడా బంగ్లా సెలబ్రేషన్స్ పరేడ్‌లో పాల్గొంటోంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన బంగ్లాదేశ్ పర్యటనలో ఢాకాలోని చారిత్రక ‘రామనా కాళి’ ఆలయాన్ని దర్శించనున్నారు. మెఘల్ పాలకుల కాలం నాటి చారిత్రక ఆలయంగా ‘రామనా కాళి’ ఆలయాన్ని చెబుతారు. 1971 మార్చిలో ఈ ఆలయాన్ని పాకిస్థాన్ సైన్యం ధ్వంసం చేసింది. బంగ్లా విమోచన యుద్ధానికి కళ్లెం వేసేందుకు పాక్ ఆర్మీ ఈ దుశ్చర్యకు పాల్పడింది.

ఆలయ విధ్వంసానికి ముందు ఢాకాలోని కీలక మత, సాంస్కృతిక వారసత్వ సంపదగా ఈ ఆలయం నిలిచింది. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ 1971 మార్చి 7న చేసిన ప్రసంగం అప్పట్లో ఉర్రూతలూగించింది. అప్పటి ఫోటోలు చూసినప్పుడు ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ ఆలయం కొట్చొచ్చినట్టు కనిపిస్తుంది. 2017లో అప్పటి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఢాకా వెళ్లినప్పుడు ఈ ఆలయ పునర్నిర్మాణానికి భారతదేశం సహకరిస్తుందని ప్రకటించారు.

ALSO READ Pralhad Joshi’s Jibe At Rahul : రాహుల్ కాస్త ఇంఫ్రూవ్ అయ్యారు..కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి