Pralhad Joshi’s Jibe At Rahul : రాహుల్ కాస్త ఇంఫ్రూవ్ అయ్యారు..కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

లఖింపూర్ ఘటనపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సెటైర్లు వేశారు.

Pralhad Joshi’s Jibe At Rahul :  రాహుల్ కాస్త ఇంఫ్రూవ్ అయ్యారు..కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

Ra Jo

Pralhad Joshi’s Jibe At Rahul : లఖింపూర్ ఘటనపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ గ‌తంలో ఎన్న‌డూ నోటీసులు ఇవ్వ‌లేద‌ని, రాహుల్ గాంధీ కాస్త ఇంప్రూవ్ అయ్యారని, కనీసం ఇప్పటికైనా నోటీసులు ఇవ్వడం ప్రారంభించడం బుధవారం ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ ప‌రిణామం ఆనంద‌దాయ‌కం అని తెలిపారు. లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, రాహుల్ నోటీసు చూశాక నిర్ణయం తీసుకుంటామన్నారు.

చిదంబ‌రం కేంద్ర హోంమంత్రిగా ఉన్న‌ప్పుడు 26/11 దాడుల‌ను ఎలా ఎదుర్కొన్నారో త‌మ‌కు బాగా తెలుస‌ంటూ కాంగ్రెస్ పై విమ‌ర్శలు గుప్పించారు ప్రహ్లాద్ జోషి. ఉగ్ర‌వాదాన్ని ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఎలా ఎదుర్కొంటోందో కూడా త‌మ‌కు తెలుస‌ని అన్నారు.

కాగా,లఖింపూర్ ఖేరీలో ఈ ఏడాది అక్టోబర్-3న జరిగిన ఘటన ప్రణాళికాబద్ధమైన కుట్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం కోర్టు ముందు చార్జ్‌షీట్ ను సమర్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందుతుడిగా ఉన్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రాయ తనయుడు ఆశిష్ మిశ్రాపై ఇప్పటికే న‌మోదైన‌ అభియోగాల‌ను మార్చాల‌ంటూ ఈ కేసు విచార‌ణ జ‌రుపుతున్న న్యాయ‌మూర్తికి సిట్ సోమవారం ఓ లేఖ రాసింది.

ఇప్పటికే ఈ కేసులో ఆశిష్ మిశ్రా, తదితరులపై హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలతోపాటు హత్యయత్నం, ఇతర అభియోగాలను కూడా ఈ కేసులో చేర్చాలని సిట్‌ ఆ లేఖలో కోరింది. ఈ నేపథ్యంలోనే సిట్ నివేదికపై చర్చించాలంటూ రాహుల్ గాంధీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

ALSO READ Lakhimpur Violence : జర్నలిస్ట్‌పై బూతులతో విరుచుకుపడ్డ కేంద్రమంత్రి