China-Russia : టార్గెట్ పెద్దన్న..అమెరికాను దెబ్బతీయటానికి ఏకమైన రష్యా, చైనా

టార్గెట్ పెద్దన్న లక్ష్యంగా అమెరికాను దెబ్బతీయటానికి రష్యా, చైనా ఏకైమయ్యాయి.రష్యా, ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొన్నక్రమంలో అంతర్జాతీయ యవనికపై కొత్తపొత్తులు

China-Russia : టార్గెట్ పెద్దన్న..అమెరికాను దెబ్బతీయటానికి ఏకమైన రష్యా, చైనా

China, Russia Targeting America

China And Russia targeting America :రష్యా,చైనా దేశాలు ఒక్కటయ్యాయి. అమెరికాను టార్గెట్ చేశాయి. టార్గెట్ పెద్దన్నగా రష్యా, చైనాలు ఏకమయ్యాయి.
ఉక్రెయిన్‌పై ఎలాగైనా పై చేయి సాధించాల‌ని ర‌ష్యా ప‌ట్టుద‌ల‌తో వుంది. ర‌ష్యా ప‌ట్టుద‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని అమెరికా తీవ్రంగా యత్నిస్తోంది. ఈ క్రమంలో డ్రాగన్ దేశంతో జట్టు కట్టింది పుతిన్ ప్రభుత్వం. దీంతో రష్యా, ఉక్రెయిన్ దేశాలకు యుద్ధం తప్పదనే పరిస్థితులు నెలకొన్నాయి.

రష్యా, ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కానీ యుద్ధం చేసే ఆలోచన లేదని రష్యా ఓ పక్కన అంటూనే మరోపక్క చైనాతో దోస్తి అంటోంది.మోపక్క యుద్ధమే గనుక వస్తే మా సత్తా ఏంటో చూపిస్తారని అమెరికా హెచ్చరిస్తోంది. సాధ్య‌మైనంత వ‌ర‌కూ ప్ర‌పంచ దేశాల‌ను త‌మ వైపు తిప్పుకొని, త‌మ బ‌లాన్ని పెంచుకోవాల‌ని ట్ర‌య‌ల్స్ చేస్తోంది. దీనికి విరుగుడుగా ర‌ష్యా, చైనా కూడా ఇదే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. ర‌ష్యా చైనా, అమెరికా మ‌ధ్య ఎప్ప‌టి నుంచో తీవ్ర విభేదాలున్నాయి. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఈ విభేదాలు మ‌రింత పెరిగిపోయాయి.దీంతో ఏం జరగబోతోందన్న టెన్షన్ ప్రపంచ దేశాల్లో వ్యక్తం అవుతుండగా.. అమెరికాకు ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేసేందుకు రష్యా, చైనా ప్రయత్నాలు చేస్తున్నాయనిపిస్తోంది. అటు పుతిన్, సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చర్చకు దారి తీసింది.

Also read : China Pakistan: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో ఇమ్రాన్ ఖాన్ భేటీ

రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కనిపిస్తున్నాయ్. వివాదాలు పెరిగి యుద్ధానికి దారి తీస్తే.. ఆ సెగ యూరప్ మొత్తానికి అంటుకుంటాయని..రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతకు మించి దారుణమైన పరిస్థితులను ప్రపంచం చూడలేదని ఆందోళన పడుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దులో ట్యాంకులు, ఫిరంగి దళాలతో పాటు రష్యా భారీగా సైనికులను మోహరించింది. ఎక్కడెక్కడ ఎంత మంది సైనికులను మోహరించింది? ఎక్కడ ఏఏ ఆయుధాలు ఉన్నాయని ఇమేజ్‌లు విడుదల చేసింది అమెరికా. ఈ ఫిబ్రవరి నెలలోనే ఉక్రెయిన్ మీదకు దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తోంది.

ఐతే అటు రష్యా మాత్రం యుద్ధం ఆలోచనే లేదని చెప్తోంది. అలాగని రెచ్చగొడితే ఎవరి మాట వినేది లేదన్నట్లు సంకేతాలు పంపుతోంది. దీంతో రష్యా వర్సెస్ అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ వేదికపై కొత్త రాజకీయ పరిణామాలు సంతరించుకుంటున్నాయి. అమెరికాను దెబ్బతీయాలనే వ్యూహంతో రష్యా, చైనాలు ఏకమయ్యాయి. రెండు దేశాలు చేతులు కలిపి పెద్దన్నను టార్గెట్ చేస్తున్నాయి.

Also read : Karnataka Hijab Row: బురఖా ధరించి వచ్చిన విద్యార్థినీలను తరగతిలోకి అనుమతించిన కళాశాల

అమెరికా, పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా రష్యా, చైనాలు చేతులు కలిపాయ్‌. కీలకాంశాలపై ఇద్దరం ఒకటే అన్నట్లుగా స్వరం వినిపిస్తూ పరస్పరం మద్దతు తెలియజేసుకున్నాయి. నాటో కూటమి విస్తరణను వ్యతిరేకించాయి. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా కడుతున్న కూటములను తప్పుబట్టాయి. తద్వారా భారత్‌ భాగస్వామిగా ఉన్న క్వాడ్‌ కూటమిపై పరోక్షంగా విమర్శలు గుప్పించాయి. తైవాన్‌.. చైనాకే చెందుతుందని స్పష్టం చేశాయి. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని కూడా ఇరు దేశాలు నిర్ణయించాయి. వింటర్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల కోసం బీజింగ్‌ వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌… చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఈ ఇద్దరు నేతలు అనుసరిస్తున్న విధానాలపై అమెరికా నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

ఉక్రెయిన్‌ విషయంపై పశ్చిమ దేశాలకు రష్యాకు మధ్య ఉద్రిక్తతలు నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్, జిన్‌పింగ్‌ల భేటీ చర్చకు దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ.. అమెరికా నుంచి వచ్చే ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గేది లేదని పరోక్షంగా తెలిపారు. ఉక్రెయిన్‌ వివాదంపై రష్యాకు చైనా మద్దతు పలికింది. వ్యూహాత్మక అంశాలపై సహకారాన్ని పటిష్ఠ పరచుకోవడానికి చైనా, రష్యాలు కలిసి ఉంటాయని జిన్‌పింగ్‌ చెప్పారు. నాటో కూటమిని, అమెరికా అనుసరిస్తున్న ఇండో-పసిఫిక్‌ విధానాన్ని ఇద్దరు నేతలు తప్పుబట్టారు. ప్రాంతీయ భద్రతకు ఇవి ముప్పుగా మారాయని ఆరోపించారు. అంతర్జాతీయ వివాదాల విషయంలో అమెరికా ఏకపక్ష వైఖరిని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రష్యా, చైనా మధ్య స్నేహానికి అవధుల్లేవంటూ చేసిన ప్రకటన మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

Also read : AP Kodi pandalu : జనాలమీదకు దూసుకొచ్చి..వ్యక్తి ప్రాణాలు తీసిన పందెం కోడి

ఉక్రెయిన్‌ మీద ఎలాగైనా పైచేయి సాధించాలని రష్యా పట్టుదలతో కనిపిస్తోంది. ర‌ష్యా ప‌ట్టుద‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇదంతా ఇలా న‌డుస్తున్న టైంలో ప్రపంచ వేదికపై స‌రికొత్త రాజకీయ ప‌క్షాన్ని తీసుకొచ్చి.. అమెరికాను దెబ్బతీయాల‌ని ర‌ష్యా, చైనా గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. ర‌ష్యా, ఉక్రెయిన్ వ్యవ‌హారం న‌డుస్తున్న త‌రుణంలోనే అమెరికా కూడా యాక్టివ్ అయింది. సాధ్యమైనంత వ‌ర‌కూ ప్రపంచ దేశాల‌ను త‌మ వైపు తిప్పుకొని… త‌మ బ‌లాన్ని పెంచుకోవాల‌ని ట్రయ‌ల్స్ చేస్తోంది. దీన్ని సవాల్‌ చేస్తున్నట్లుగా ర‌ష్యా, చైనా కూడా ఇదే ప‌నిలో కనిపిస్తున్నాయ్. ర‌ష్యా, చైనా, అమెరికా మ‌ధ్య ఎప్పటి నుంచో విభేధాలు భగ్గుమంటున్నాయ్. గత రెండు మూడేళ్లుగా ఇవి తారా స్థాయికి చేరాయ్.

నిజానికి పుతిన్, జిన్‌పింగ్ విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఉక్రెయిన్ ప్రస్తావన ప్రత్యక్షంగా ఎక్కడా లేదు. ఐతే ఈ ఒక్క మీటింగ్‌తో వాళ్ల లక్ష్యం ఏంటో స్పష్టంగా అర్థం అయింది. అమెరికా జోరుకు, పెద్దరికానికి ఎప్పుడెప్పుడు బ్రేకులు వేద్దామా అని రష్యా, చైనా ఎదురుచూస్తున్నాయ్. ఐతే ఇప్పుడు ఉక్రెయిన్ రూపంలో ఆ అవకాశం వచ్చినట్లు అయింది. దీంతో పెద్దన్నకు వ్యతిరేకంగా చైనా, రష్యా కలిసిపోయాయ్. ప్రపంచ రాజ‌కీయాల్లో కొత్త ప్రత్యామ్నాయం సృష్టించేందుకు ఉమ్మడి ప్రయత్నాలు మొదలుపెట్టాయ్. ఇప్పటికే టెన్షన్ పుట్టిస్తున్న రష్యా, ఉక్రెయిన్ వ్యవహారం.. ఈ మీటింగ్ తర్వాత ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందా అన్న టెన్షన్ ప్రపంచదేశాలను వెంటాడుతోంది.