Russia ukraine war :భర్త నుంచి విడాకులు తీసుకున్న పుతిన్ కుమార్తె మారియా..యుక్రెయిన్ పై యుద్ధమే కారణమంటూ ప్రచారం

రష్యా అధ్యక్షుడుు పుతిన్ కుమార్తె మారియ తన భర్త జోరిట్ ఫాసెన్‌‌ నుంచి విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులకు కారణం యుక్రెయిన్ పై యుద్ధమే కారణమంటూ ప్రచారం జరుగుతోంది.

Russia ukraine war :భర్త నుంచి విడాకులు తీసుకున్న పుతిన్ కుమార్తె మారియా..యుక్రెయిన్ పై యుద్ధమే కారణమంటూ ప్రచారం

Russia ukraine war..putin daughter maria marriage collapse :  యుక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. ఈ యుద్ధం కారణంగా రష్యాపై పలు విధాలుగా నిషేధాలు కొనసాగుతున్నాయి. ఈ నిషేధాలు రష్యాపై ఆర్థికంగా ప్రభావం చూపుతున్నా అధ్యక్షుడు పుతిన్ మాత్రం యుక్రెయిన్ పై యుద్ధం చేసే విషయంలో తగ్గేదేలేదంటున్నారు. ఆర్థికంగా పలు దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. యుక్రెయిన్ పై యుద్ధ ప్రభావం రష్యాపై బాగానే పడుతోంది. ఇది దేశంపరంగానే కాకుండా పుతిన్ కు వ్యక్తిగతంగా కూడా ప్రభావం పడుతున్నట్లుగా తెలుస్తోంది. పుతిన్ ను మానసికంగా బలహీన పరిచే చర్యలు కూడా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే పుతిన్‌ ప్రియురాలుగా భావిస్తున్న అలీనా కబయేవాపై కూడా ఈ యుద్ధ ప్రభావం పడినట్లుగా తెలుస్తోంది.ఆమె ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో సెక్యూరిటీ మధ్య జీవిస్తున్నట్లు సమాచారం. స్విట్జర్లాండ్‌ నుంచి ఆమెను బహిష్కరించాలనే డిమాండ్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ యుద్ధం ప్రభావం వల్లే పుతిన్ కుమార్తె తన భర్తనుంచి విడాకులు తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇలా పుతిన్ ను యుక్రెయిన్ యుద్ధం మానసికంగా ప్రభావం చూపుతోంది అనిపిస్తోంది.

Also read :  Russia-Ukraine War: రష్యా బలగాలపై ప్రతిదాడికి యుక్రెయిన్‌కు 6వేల యూకే మిస్సైల్స్

పుతిన్ పెద్దకూతురు మారియా భర్తకు విడాకులిచ్చారు. దీనికి యుక్రెయిన్ పై రష్యా చేపట్టిన యుద్ధమే కారణమనే ప్రచారం జరుగుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెద్ద కూతురు 36 ఏళ్ల మారియా వొరంత్సోవా మరోసారి వార్తల్లో నిలిచారు. రెండు సంవత్సరాల క్రిత రష్యా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్పుత్నిక్ వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకుని మారియా వార్తల్లో నిలిచారు. ఈక్రమంలో ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్నారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

పుతిన్ పెద్ద్ కూతురు మారియా వొరంత్సోవా వృత్తిరీత్యా డాక్టర్. జన్యుపరమైన వ్యాధుల (Specialist in genetic diseases) స్పెషలిస్టు. మారియా నెదర్లాండ్స్‌కు చెందిన వ్యాపారవేత్త జోరిట్ ఫాసెన్‌‌ను 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మారియా దంపతులు అనూహ్య కారణాలతో వారు నెదర్లాండ్స్ వదిలి రష్యా రాజధాని మాస్కోకు షిఫ్ట్ అయ్యారు.2014లో మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని రష్యా దళాలు తూర్పు లో కూల్చేసిన తర్వాత మారియాను నెదర్లాండ్స్ నుంచి బహిష్కరించాలని డచ్ ప్రజలు నిరసనలు చేశారు. దీంతో మారియా దంపతులు 2015లో మాస్కోకు మకాం మార్చారు.

Also read :  Russia On Nuclear Weapons : అదే జరిగితే.. అణ్వాయుధాలను ప్రయోగిస్తాం- పశ్చిమ దేశాలకు రష్యా వార్నింగ్

డాక్టర్ అయిన మారియా భర్త సహకారంతో మెడికల్ కంపెనీ స్థాపించటానికి యత్నాలుచేస్తున్నారు. కానీ ఇప్పుడు వారు విడిపోయారు. మారియా భర్త జోరిట్ ఫాసెన్‌‌ నుంచి విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పుతిన్ కూతురు భర్త నుంచి విడాకులు తీసుకున్నారనే వార్త పతాక శీర్షికలా మారింది అంతర్జాతీయ మీడియాకు. ముఖ్యంగా యుక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగిస్తున్న క్రమంలో మారియా విడాకుల వార్త మరింత హాట్ టాపిక్ గా ప్రఖ్యాత అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. యుక్రెయిన్ పై రష్యా యుద్దం వల్లనే మారియా దంపతుల మధ్య వివాదాలు వచ్చాయరి అవి పెరిగి అభిప్రాయభేదాలకు కారణమయ్యాయని..ఆ విభేధాలు కాస్తా..విడాకులకు దారితీశాయని కొన్ని కథనాలు వచ్చాయి. వస్తున్నాయి.

పుతిన్ కూతురి విడాకుల వ్యవహారంపై రష్యా జర్నలిస్ట్ సెర్గీ కనేవ్ ఇన్వెస్టిగేషన్ చేసింది. మారియా-జోరిట్ ఫాసెన్‌‌ యుక్రెయిన్ యుద్దం ప్రాంభానికి ముందే విడాకులు పొందినట్లు ఆ రిపోర్టులో వెల్లడైంది. తద్వారా యుద్దం వల్లే పుతిన్ కూతురి కాపురం కూలిందనే వార్తలు నిజం కాదని కొన్ని మీడియాలు చెబుతున్నాయి.

Also read : Boris Johnson With Modi : పుతిన్ చర్యలతో ప్రపంచానికి పెను విపత్తు- మోదీతో బ్రిటన్ ప్రధాని

వ్లాదిమిర్ పుతిన్ కేజీబీ ఏజెంట్ గా పనిచేస్తున్న సమయంలోనే ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినాను 1983లో పెళ్లాడారు. వాళ్లకు ఇద్దరు కూతుళ్లు. వారే మరియా(36), కేథరిన్(34). 2014లో పుతిన్ తన భార్య ల్యూడ్మిలా నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం పుతిన్ తనకంటే వయసులో చాలా చిన్న అలీనా కబయేవా (38)అనే మాజీ అథ్లెట్ తో రహస్య బంధంలో ఉన్నారని తెలుస్తోంది. యుక్రెయిన్ పై యుద్దం కొనసాగుతున్న క్రమంలో పుతిన్ తన కుటుంబీకులను రహస్య ప్రాంతాలకు తరలించినట్లుగా సమాచారం. అలీనా పుతిన్ ప్రియురాలు అనే కారణంతోనే ఆమెను స్విట్జర్లాండ్‌ నుంచి ఆమెను బహిష్కరించాలంటూ డిమాండ్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also read : Russian Soldiers Killed : రష్యాకు బిగ్‌లాస్.. యుద్ధంలో 15,600 మంది సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ

కాగా పుతిన్ వ్యక్తిగత జీవితం గురించి బయటకు తెలియటానికి ఇష్టపడరు. ఓ సారి ఇదే విషయంపై పుతిన్ మాట్లాడుతూ.. “నాకు వ్యక్తిగత జీవితం ఉంది. అందులో జోక్యాన్ని అనుమతించను. దానిని గౌరవించాలి.”అని అన్నారు.