Russia Sell Zelensky House : యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య కోసం కొన్నఇంటిని అమ్మేస్తున్న పుతిన్ .. ధర ఎంతో తెలుసా..?

రష్యా శత్రువులకు అక్కడ ఆస్తులు ఉండకూడదు. అందుకే యుక్రెయిన్ అధ్యక్షుడు తన భార్య కోసం కొనుగోలు చేసిన ఓ ఇంటిని రష్యా అధ్యక్షుడు పుతిన్ అమ్మేస్తున్నారు.

Russia Sell Zelensky House : యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య కోసం కొన్నఇంటిని అమ్మేస్తున్న పుతిన్ .. ధర ఎంతో తెలుసా..?

Russia  sell Ukraine Presiden  Zelensky  House  

Russia Sell Ukraine Presiden Zelensky  House : క్రిమియాను ఆక్రమించుకున్న రష్యా.. దాన్ని పాలనా బాధ్యతలను క్రిమియాకు చెందిన నేతను నియమించింది. ప్రస్తుతం ఆ క్రిమియా నేత విడుదల చేసిన వీడియోపై అంతర్జాతీయ మీడియా సంస్థ ఓ కథనాన్ని వెలువరించింది. క్రిమియాలో యుక్రెయిన్‌ ఆస్తులను జాతీయం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించినట్లు ఆ కథనంలో పేర్కొంది. క్రిమియాను స్వాధీనం చేసుకున్న రష్యా అక్కడి ఆస్తులు కూడా తమవేనంటోంది. అలా క్రిమియాలో ఉన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నివాసాన్ని కూడా వేలం వేయాలని పుతిన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. క్రిమియాలో ఉన్న ఆస్తులన్నింటిపైనా స్థానిక ప్రభుత్వానికే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది రష్యా. క్రిమియాలో రష్యా శత్రువులకు ఆస్తులు ఉండకూడదని వెల్లడించారు.

2013లో క్రిమియాలోని తీరప్రాంతమైన లివాడియాలో జెలెన్‌స్కీ ఓ ఇంటిని కొన్నారు. దాన్ని ఆయన భార్య ఒలెనా జెలెన్‌స్కా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో నివసించే జెలెన్‌స్కీ.. అప్పుడప్పుడూ విడిది కోసం క్రిమియాలోని ఆ ఇంటికి వెళ్లేవారు. రష్యా యుద్ధంతో క్రిమియాను ఆక్రమించిన తర్వాత..జెలెన్ స్కీ ఆ ఇంటికి వెళ్లటం సాధ్యంకాకపోవటం ఆ ఇల్లు ఖాళీగానే ఉంటోంది.ఆ ఇంటి విలువ 800,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 6,61,691,120లు.

జెలెన్‌స్కీ ఇంటితోపాటు మొత్తం 57 ఆస్తులను వేలం వేయనున్నారు. వాటి విక్రయం ద్వారా వచ్చిన నిధులను రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య కోసం వినియోగించనున్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు పరిహారంగా అందించనున్నట్లు క్రిమియా పార్లమెంట్ స్పీకర్ వెల్లడించారు. కాగా..క్రిమియాను 2014లోనే రష్యా ఆక్రమించుకున్నప్పటికీ.. చాలా దేశాలు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని అధికారికంగా యుక్రెయిన్‌లోని భాగంగానే గుర్తిస్తున్నాయి. కానీ దీన్ని పూర్తిగా తమదిగా భావించటానికి ఈ యుద్ధం కొనసాగింపులో జెలెన్ స్కీ ఇంటితో పాటు మరో 57 మంది యుక్రెయిన్ కు చెందినవారి ఇస్తులను కూడా అమ్మేయాలనుకుంటోంది రష్యా.

కాగా రష్యా – యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై సంవత్సరంన్నర కావస్తోంది. యుద్ధంలో రెండు దేశాలు ఏమాత్రం తగ్గటంలేదు. యూరప్ దేశాలు అందిస్తున్న సహాయ సహకారాలతో యుక్రెయిన్ తన శక్తికి మించి రష్యాతో పోరాడుతోంది. యుక్రెయిన్ ను తక్కువ అంచనా వేసిన రష్యా ఈజీగా స్వాధీనం చేసేసుకోవచ్చునుకుంది. కానీ యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించే అమెరికాతో పాటు యూరప్ దేశాలు యుక్రెయిన్ కు ఆయుధాలతో పాటు పలు విధాలుగా సహాయ పడటంతో రష్యా పాచికలు పారలేదు. యుక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో.. అలవోకగా విజయం సాధించవచ్చన్న పుతిన్ ఆకాంక్షలు నెరవేరలేదు. దీనికి తోడు యుద్ధాన్ని ఖండిస్తూ ప్రపంచ దేశాలు.. రష్యాపై ఆంక్షలు విధించడంతో పుతిన్ ను టార్గెట్ చేశాయి. అయినా పుతిన్ ఏమాత్రం తగ్గట్లేదు.

ఈ యుద్ధంతో ఆర్థికంగా నష్టపోతున్నా రష్యా తగ్గట్లేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రష్యా విరాళాలు సేకరిస్తోంది. దీంట్లో భాగంగానే క్రిమియాలో యుక్రెయిన్‌కు చెందిన వారి ఆస్తులను విక్రయించడం ప్రారంభించింది. వీటిలో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ నివాసం కూడా ఉండటం గమనించాల్సిన విషయం.