TTD: యాంకర్ శివ జ్యోతికి షాకిచ్చిన టీటీడీ.. ఆధార్ కార్డు బ్లాక్… స్వామీ దర్శనాలపై నిషేధం..

ప్రముఖ యాంకర్ శివ జ్యోతికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు షాకిచ్చింది. తిరుమల శ్రీవారి(TTD) దర్శనాలపై జీవితకాల నిషేధం విధించింది. ఈమేరకు ఆమె అధికారులు ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేశారు.

TTD: యాంకర్ శివ జ్యోతికి షాకిచ్చిన టీటీడీ.. ఆధార్ కార్డు బ్లాక్… స్వామీ దర్శనాలపై నిషేధం..

TTD blocks Shiva Jyoti Aadhaar card, imposes lifetime ban on Srivari darshan

Updated On : November 27, 2025 / 9:17 AM IST

TTD: ప్రముఖ యాంకర్ శివ జ్యోతికి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) బోర్డు షాకిచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనాలపై జీవితకాల నిషేధం విధించింది. ఈమేరకు ఆమె అధికారులు ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేశారు. దీంతో, ఈ న్యూస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం అయ్యింది. అయితే, ఇటీవల శివజ్యోతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లిన విషయం తెలిసిందే. దర్శనం క్యూ లోనే లో నిల్చొని వీడియో తీస్తూ రిచెస్ట్ బెగ్గర్లమ్ అని, ప్రసాదం అడుక్కుంటున్నాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియోపై స్వామివారి భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చాలా మంది ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు.

Keerthy Suresh: నేను ఆ సినిమా చేయడం లేదు.. క్లారిటీ ఇచ్చేసిన కీర్తి సురేష్.. మరి మేకర్స్ ఏమంటారో..

విషయం తీవ్రతరం అవడంతో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వీడియో విడుదల చేసింది శివజ్యోతి. నేను మాట్లాడింది తప్పు. అందుకు ముందుగా భక్తులందరికీ నా క్షమాపనలు చెప్తున్నాను. నేను అలా అనకుండా ఉండాల్సింది. కానీ, నేను వేరే ఏ దురుద్దేశంతో అలా అనలేదు. నాకు వెంకటేశ్వరా స్వామీ అంటే చాలా ఇష్టం. చాలా కాలం తరువాత పుట్టబోతున్న ఈ నాబిడ్డను కూడా ఆ స్వామీ ఇచ్చాడు”అంటూ చెప్పుకొచ్చింది. అయినప్పటికి టీటీడీ బోర్డు తాజాగా ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేసింది. మరి ఈ విషయంపై శివజ్యోతి ఎలా స్పందిస్తుందో చూడాలి.