Czech Republic : పుతిన్‌కు షాక్.. యుక్రెయిన్‌కు మద్దతుగా చెక్ రిపబ్లిక్.. పవర్‌ఫుల్ ఆయుధాలు సరఫరా

యుక్రెయిన్ కు మద్దతుగా నేరుగా రంగంలోకి దిగింది చెక్ రిపబ్లిక్. యుక్రెయిన్ కు యుద్ధ ట్యాంకులు అందించేందుకు రెడీ అయ్యింది.(Czech Republic)

Czech Republic : పుతిన్‌కు షాక్.. యుక్రెయిన్‌కు మద్దతుగా చెక్ రిపబ్లిక్.. పవర్‌ఫుల్ ఆయుధాలు సరఫరా

Czech Republic : రష్యా తగ్గనంటోంది. యుక్రెయిన్ తల వంచడం లేదు. దీంతో రోజులు గడిచే కొద్దీ యుద్ధం తీవ్రరూపం దాలుస్తోంది. 42 రోజులకు చేరిన యుద్ధంలో ఇప్పటివరకు ఏ దేశానికి మరే దేశం కూడా ప్రత్యక్షంగా ఆయుధాలు సప్లయ్ చేయలేదు. అయితే ఇప్పుడు యుక్రెయిన్ కు మద్దతుగా నేరుగా రంగంలోకి దిగింది చెక్ రిపబ్లిక్. యుక్రెయిన్ కు యుద్ధ ట్యాంకులు అందించేందుకు రెడీ అయ్యింది. అవి కూడా సాధారణ ఆయుధ సామాగ్రి కాదు. సోవియట్ కాలంలో శత్రువులను చిత్తు చేసిన యుద్ధ ట్యాంకులను(T-72 యుద్ధ ట్యాంకులు) జెలెన్ స్కీ దళాలకు ఇవ్వనుంది చెక్ రిపబ్లిక్.

అంతేకాదు హోవిట్జర్లను కూడా యుక్రెయిన్ కు పంపనుంది చెక్ రిపబ్లిక్. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత తొలిసారిగా యూరోపియన్ యూనియన్ లోని ఓ దేశం నుంచి యుక్రెయిన్ కు చేరనున్న యుద్ధ ట్యాంకులు ఇవి. ఈ తరహా సాయం యుక్రెయిన్ కు నేరుగా అందడం ఇదే తొలిసారి. దీంతో మిగిలిన యూరోపియన్ దేశాలు కూడా డైరెక్ట్ గా రంగంలోకి దిగుతాయా? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.(Czech Republic)

Ukraines Crisis:తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా భారత్ గళం.. బుచాలో పౌరుల హత్యలపై దర్యాప్తుకు డిమాండ్

బుచాలో రష్యా మారణహోమం తర్వాత ఒక్కసారిగా ప్రపంచ దేశాలు పుతిన్ దళాలపై చాలా సీరియస్ గా ఉన్నాయి. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో చెక్ రిపబ్లిక్ నుంచి ఆయుధాలు సప్లయ్ కావడంతో మిగిలిన ఈయూ దేశాలు కూడా అదే వైపుగా అడుగులు వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

నిజానికి యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా యుక్రెయిన్ సీక్రెట్ గా అటు అమెరికా ఇటు యూరప్ దేశాలు ఆయుధాలు సరఫరా చేశాయి. తమ దగ్గరున్న ఆయుధాలతో పాటు అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చిన ఆయుధాలతో యుక్రెయిన్ మరింత దూకుడు ప్రదర్శించింది. యుద్ధ రంగంలో రష్యా సేనలకు చుక్కలు చూపించింది. యాంటీ ట్యాంక్ మిస్సైళ్లతో రష్యా క్షిపణులను సమర్థవంతంగా ఎదుర్కొంది. అంతేకాదు రష్యాపై డిఫెన్స్ వదిలి అటాకింగ్ మొదలు పెట్టింది. ఇదంతా అమెరికా, యూరప్ దేశాల సాయంతోనే. మరోవైపు అదే సమయంలో రష్యాకు ఆయుధాల కొరత కూడా ప్రారంభమైంది. రష్యా సైనికులు, ఆర్మీ జనరల్స్ కూడా యుక్రెయిన్ దళాల దాడుల్లో మరణించారు. దీంతో రష్యా సేనలు క్రమంగా వెనకడుగు వేయాల్సి వచ్చింది.

Russia-ukraine war : యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాను శిక్షించండి..లేదంటే ఐరాసను మూసేయండి : జెలెన్‌స్కీ

రష్యా సైన్యం ఆక్రమించిన చాలా పట్టణాలు, గ్రామాలను యుక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. ఓవైపు ఆయుధాల కొరతతో రష్యా ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, యూరప్ దేశాలు యుక్రెయిన్ కు సాయం చేస్తుండటం పుతిన్ కు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. దీంతో తనకు పట్టున్న తూర్పు యుక్రెయిన్ లోని వేర్పాటువాద డాన్ బాస్ ప్రాంతాలపై ఫోకస్ పెంచింది రష్యా. అక్కడి ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకోవడమే దాని టార్గెట్. అయితే, అక్కడ కూడా తమదే పైచేయి అవ్వాలని భావిస్తున్న యుక్రెయిన్ దాని కోసం యూరప్ దేశాల సాయం కోరుతోంది. ఇప్పటికే అమెరికా మిత్ర దేశాలు గుట్టు చప్పుడు కాకుండా ఇన్నాళ్లూ ఆయుధాలు పంపగా, ఇప్పుడు చెక్ రిపబ్లిక్ అధికారికంగా టీ-72 యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలను పంపిస్తుండటం రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ అవుతోంది.