Russia Ukraine War : పుతిన్ రివర్స్ కౌంటర్.. బైడెన్ సహా 12 మంది టాప్ యూఎస్ ప్రతినిధులపై ఆంక్షలు..!

Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్ విషయంలో రష్యా వైఖరిపై పాశ్చాత్య దేశాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.

Russia Ukraine War : పుతిన్ రివర్స్ కౌంటర్.. బైడెన్ సహా 12 మంది టాప్ యూఎస్ ప్రతినిధులపై ఆంక్షలు..!

Russia Ukraine War Russia Says It's Sanctioning Biden, Hillary Clinton And Top U.s. Officials

Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్ విషయంలో రష్యా వైఖరిపై పాశ్చాత్య దేశాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. రష్యా దురాక్రమణపై పాశ్చాత్య దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్… రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురుపై నిషేధం విధించాయి. ఈ క్రమంలో పుతిన్ అమెరికాకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా అగ్రనేతలు రష్యాలో ప్రవేశించకుండా వారిపై ఆంక్షలు విధించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, హిల్లరీ క్లింటన్ సహా మొత్తం 12 మందిపై పుతిన్ ఆంక్షలు విధించారు. కెనడా ప్రధాని జస్టిస్ ట్రోడోపై కూడా పుతిన్ ఆంక్షలు విధించారని రష్యా విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించింది.

అమెరికా అగ్ర నేతలు రష్యాలో ప్రవేశించడానికి వీలు లేకుండా వారిపై ఆంక్షలు విధించారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, హిల్లరీ క్లింటన్‌ సహా మొత్తం 12 మందిపై పుతిన్‌ ఆంక్షలు విధించారు. అటు కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడోపై కూడా ఆంక్షలు విధించినట్టు రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్‌లకు కూడా వర్తిస్తాయని మాస్కో ఒక ప్రకటనలో తెలిపింది. కెనడా ప్రధాని ట్రూడో, ఆయన మంత్రులతో సహా 313 మంది కెనడియన్లపై శిక్షాత్మక చర్యలను రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యుక్రెయిన్‌లో రష్యా సైనిక జోక్యానికి ప్రతిస్పందనగా అమెరికా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌లపై ఆంక్షలను నిషేధించింది. అమెరికా రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఇతర దేశాల నుంచి అనుమతులను నిలిపివేసింది.

Russia Ukraine War Russia Says It's Sanctioning Biden, Hillary Clinton And Top U.s. Officials (1)

Russia Ukraine War Russia Says It’s Sanctioning Biden, Hillary Clinton And Top U.s. Officials

ఈ నేపథ్యంలోనే పుతిన్ అమెరికాకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. రష్యా ఆంక్షలు విధించిన జాబితాలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ US ఛైర్మన్ మార్క్ మిల్లీ, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివాన్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ విలియం బర్న్స్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకీ కూడా ఉన్నారు. ఈ జాబితాలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దలీప్ సింగ్, యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ చీఫ్ సమంతా పవర్, డిప్యూటీ ట్రెజరీ సెక్రటరీ అడెవాలే అడెయెమో యుఎస్ ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ చీఫ్ రెటా జో లూయిస్ కూడా ఉన్నారు. బైడెన్ కుమారుడు హంటర్ మాజీ విదేశాంగ కార్యదర్శి డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌లను కూడా రష్యాలోకి ప్రవేశించకుండా నిషేధించింది. అంతేకాదు.. అమెరికా అధికారులు, సైనిక అధికారులు, చట్టసభ సభ్యులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రముఖులపై కూడా మాస్కో త్వరలో అదనపు ఆంక్షలను ప్రకటిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

Read Also : Russian Ukraine War : సరిహద్దుల్లో యుక్రెయిన్‌ మహిళలపై లైంగిక దాడులు..!