Sri Lanka Crisis : గొటబాయకు మాల్దీవుల్లోనూ నిరసనలు..మాలే నుంచి సింగపూర్ కు వెళ్లే ప్లాన్ లో లంక అధ్యక్షుడు

ప్రజల నిరసనలను తట్టుకోలేకి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు దేశం వదిలి పారిపోయినా నిరసనల తాకిడి తప్పలేదు. శ్రీలంకను వదిలి రాత్రికి రాత్రే కుటుంబంతో సహా మాల్దీవులకు పారిపోయిన గొటబయకు మాల్దీవుల్లో కూడా నిరసనల వెల్లువ తప్పలేదు. మాల్దీవుల్లో నివసిస్తున్న శ్రీలంకవాలసులు గొటబయపై తిరగబడ్డారు. నిరసనలు తెలియజేశారు.

Sri Lanka Crisis : గొటబాయకు మాల్దీవుల్లోనూ నిరసనలు..మాలే నుంచి సింగపూర్ కు వెళ్లే ప్లాన్ లో లంక అధ్యక్షుడు

Protests Against Gotabaya In Maldives (1)

Protests against Gotabaya in Maldives : ప్రజల తిరుగుబాటును జీర్ణించుకోలేక..వారి నిరసనలను తట్టుకోలేకి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు దేశం వదిలి పారిపోయినా నిరసనల తాకిడి తప్పలేదు. శ్రీలంకను వదిలి రాత్రికి రాత్రే కుటుంబంతో సహా మాల్దీవులకు పారిపోయిన గొటబయకు మాల్దీవుల్లో కూడా నిరసనల వెల్లువ తప్పలేదు. మాల్దీవుల్లో నివసిస్తున్న శ్రీలంకవాలసులు గొటబయపై తిరగబడ్డారు. నిరసనలు తెలియజేశారు. మాలే నగరంలో శ్రీలంక జాతీయ పతాకాలు పట్టుకుని గొటబాయకు, శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ప్రదర్శన నిర్వహించారు. రాజపక్సను తిరిగి శ్రీలంకకు పంపించివేయాలంటూ డిమాండ్ చేశారు.

శ్రీలంక జాతీయ జెండాలు, ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ప్రియమైన మాల్దీవుల స్నేహితుల్లారా..క్రిమినల్స్ కు ఈ ప్రాంతం సురక్షితంగా మారకుండా మీ ప్రభుత్వానికి తెలియజేయండి’అని బ్యానర్ ప్రదర్శించారు. శ్రీలంక నుంచి మాల్దీవులకు పరారైన రాజపక్స ఓ విలాసవంతమైన రిసార్డ్స్ లో తలదాచుకున్నట్లుగా స్థానిక మీడియాలు వెల్లడించాయి. ఈ క్రమంలో గొటబయ రాజపక్స శ్రీలంక వైమానిక దళానికి చెందినవిమానంలోనే మాల్దీవుల నుంచి సింగపూర్ వెళ్లనున్నట్లుగా సమాచారం.

కాగా..శ్రీలంకలో ప్రజలు నిరంతరం చేస్తున్న ఆందోళనలకు భయపడి మాల్దీవులకు పారిపోయిన గొటబాయపై మాల్దీవుల్లో నివసించే శ్రీలంక వాసులు నిరసనలు తెలిపారు.వాయుసేనకు చెందిన విమానంలో భార్య, ఇద్దరు బాడీగార్డులతో కలిసి గొటబాయ మాల్దీవుల రాజధాని మాలే నగరం చేరుకున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్న ఆయన ఇప్పటికీ పదవిలోనే కొనసాగుతున్నారు. దేశం వదిలిపారిపోతూ కూడా కనీసం రాజీనామా చేయకుండానే పారిపోయారు. పదవి నుంచి తప్పుకోవాలనే శ్రీలంకేయుల డిమాండ్స్ ను ఏమాత్రం పట్టించుకోకుండా ఈ క్షణం వరకు అధ్యక్ష పదవిని పట్టుకుని వేలాడుతున్నారు.

ఈ క్రమంలో గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా మాల్దీవుల్లోని శ్రీలంక జాతీయులు నిరసనలు తెలిపారు. పదవికి రాజీనామా చేయాలని..దేశం కష్టాల్లో ఉంటే ఎదుర్కోవటం చేతకాక మాల్దీవులకు పారిపోయి వచ్చిన అధ్యక్షుడు వెంటనే ఈ దేశం వదలి శ్రీలంక వెళ్లిపోవాలని డిమాండ్స్ చేశారు.

ఈక్రమంలో తమ దేశంలోకి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయను అనుమతించడంపై మాల్దీవ్స్ నేషనల్ పార్టీ (ఎంఎన్ పీ) కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీలంక ప్రజల మనోభావాలను మాల్దీవుల ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఎంఎన్ పీ నేత దున్యా మౌమూన్ విమర్శించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరుతూ తీర్మానం ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో గొటబయ రాజపక్స్ మాల్దీవుల నుంచి సింగపూర్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.