Srinivasa Kalyanam : డల్లాస్‌లో వైభవంగా శ్రీనివాసకళ్యాణం

అమెరికాలోని  వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.

Srinivasa Kalyanam : డల్లాస్‌లో వైభవంగా శ్రీనివాసకళ్యాణం

Srinivasa kalyanam : అమెరికాలోని  వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.

కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.

డల్లాస్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.  టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, విశాఖపట్నం ఎంపి శ్రీ సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారు శ్రీ జ్ఞానేంద్ర రెడ్డి,  ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ రత్నాకర్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస రెడ్డితో సహ పలువురు ప్రముఖులు ఈకళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.

Also Read : South Central Railway : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగు రైళ్లు 24 రోజుల పాటు రద్దు