Texas Mom : బడికి పంపుతున్నా..క్షమించండి అంటూ పిల్లలకు తల్లి లేఖ

బడికి పంపాల్సి వస్తున్నందుకు క్షమించండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ..ఆ తల్లి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన టెక్సాస్ లో చోటు చేసుకుంది.

Texas Mom : బడికి పంపుతున్నా..క్షమించండి అంటూ పిల్లలకు తల్లి లేఖ

Mother

Apologizes To Daughter : కరోనా కారణగా విద్యా వ్యవస్థ అస్తవ్వస్థమైంది. ప్రస్తుతం కరోనా కంట్రోల్ లో ఉండడంతో స్కూళ్లు తెరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కరోనా నిబంధనలు పాటిస్తూ..పిల్లలను బళ్లకు పంపియ్యాలంటూ..తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. కానీ..కేసులు అలాగే ఉండడంతో తల్లిదండ్రులు వెనుకా ముందు అవుతున్నారు. పిల్లలను స్కూళ్లకు పంపిస్తే..ఎక్కడ కరోనా అంటుంతుందనే భయం వారిలో నెలకొంది. ఇలాగే ఓ తల్లి భయం భయంగా..పిల్లలను స్కూళ్లకు పంపింది. ఈ సందర్భంగా ఆ తల్లి పిల్లలకు లేఖ రాసింది. బడికి పంపాల్సి వస్తున్నందుకు క్షమించండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ..ఆ తల్లి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన టెక్సాస్ లో చోటు చేసుకుంది.

Read More : Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో షూటర్ అవని లేఖారాకు గోల్డ్ మెడల్

టెక్సాస్, కాలిఫోర్నియా నగరాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. టెక్సాస్ లో నెల రోజుల క్రితం 8 వేల 962 కేసులు నమోదవుతే…ఇప్పుడు 20 వేల 236కి చేరింది. అయినా..స్కూళ్లు తెరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కిండర్ గార్డన్, ఫస్ట్ గ్రేడ్ చదువుతున్న తన ఇద్దరు పిల్లలకు సరైన రక్షణ లేకుండానే బడికి పంపుతున్నందుకు ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. బడికి పంపుతున్న చిన్నారులకు సరైన జాగ్రత్తలు చెప్పిందా ఆ తల్లి. అస్సలు మాస్కులు తీయొద్దని, దీనివల్ల ఏమి ఉపయోగం లేకపోయినా..సరే..అలాగే ఉంచాలని చెప్పింది. కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ ఇప్పించలేదని, ఏం జరుగుతుందో తనకు తెలియదు..జాగ్రత్త అంటూ సూచనలు చేసింది.

Read More : Mohanlal : వైరల్ అవుతున్న మోహన్ లాల్ వీడియో.. కామెంట్ చేసిన పృథ్వీరాజ్

ప్రపంచంలో మిమ్మల్ని ప్రేమించనంతగా…నేను ఎవర్నీ ప్రేమించడం లేదని, మీరంటే నాకు ప్రాణం అంటూ తెలిపింది. స్కూళ్లో కరోనా నిబంధనలు మరిన్ని పాటించాలని చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదని ఈ పరిస్థితుల్లో తన ఇంట్లో ఎవరైనా అనరోగ్యానికి గురవుతే ఏంటి పరిస్థితి అంటూ లేఖలో ప్రశ్నించిందా ఆ తల్లి. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తమను ఇరుకున పడేశారని, స్కూళ్లకు మాస్కులు ధరించి రావాలన్న నిబంధన కూడా ఆయన ఎత్తివేశారని ఆరోపించారు.

Read More : Bigg Boss Telugu 5 రియాల్టీ షో ప్రీమియర్ డేట్.. టీవీ టైమింగ్స్, స్ట్రీమింగ్ ఫుల్ డిటైల్స్..!

ఈ సంక్షోభాన్ని మళ్లీ ఒంటరిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో స్కూళ్లకు పంపుతున్నందుకు తన గుండె పగిలిపోతోందని తన బాధను ఆ లేఖలో వ్యక్తం చేసింది. ఈ లేఖ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో స్కూళ్ల యాజమాన్యాలు పలు నిర్ణయాలు తీసుకున్నాయి. విద్యార్థులు, టీచర్లు, వాళ్లకు కలవడానికి వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని చెప్పాయి.