Vaccine : సబ్ వేరియంట్లపై టీకా ప్రభావం కష్టమే!

అయితే రానున్న రోజుల్లో ఒమిక్రాన్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకొచ్చి కల్లోలం సృష్టించే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేయవని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Vaccine : సబ్ వేరియంట్లపై టీకా ప్రభావం కష్టమే!

Sub Variant Vaccine

vaccine effect : కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. క్రమక్రమంగా కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ రక్షణగా ఉందిలే అనుకుంటున్నాం. కానీ కొత్త వేరియంట్లతో దాడి చేస్తున్న వైరస్‌పై టీకాల ప్రభావం తక్కువేనని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తూ కలవరపెడుతోంది. అయితే రానున్న రోజుల్లో ఒమిక్రాన్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకొచ్చి కల్లోలం సృష్టించే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేయవని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచడం, ఇన్‌ఫెక్షన్‌ను అడ్డగించేందుకు టీకాలు పనిచేయకపోవచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్‌లో ba.4, ba.5 సబ్ వేరియంట్లు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అయితే ఒమిక్రాన్‌ తర్వాత వచ్చిన ba.2 వేగంగా వ్యాప్తి చెందిందని చెప్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బయటపడినప్పటికీ వ్యాక్సినేషన్‌ ఎక్కువ మొత్తంలో జరిగింది.

Pfizer/BioNTech Vaccine: ఆరు నెలల్లో వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోతుంది.. డెల్టా వేరియంట్‌తో ప్రమాదమే!

అయితే కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో టీకాల ప్రభావం అంతంత మాత్రంగా ఉండి వైరస్ వ్యాప్తి పెరిగిందంటున్నారు. ba.4, ba.5 ద్వారా రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. వీటి ప్రభావంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య అంతగా ఉండకపోవచ్చంటున్నారు. కానీ కరోనా నిబంధనలు పాటించి..వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు.