గెలాక్సీలో 30ఏలియన్ జాతులు ఉన్నాయంటోన్న రీసెర్చర్స్

  • Published By: Subhan ,Published On : June 15, 2020 / 01:00 PM IST
గెలాక్సీలో 30ఏలియన్ జాతులు ఉన్నాయంటోన్న రీసెర్చర్స్

గెలాక్సీలో 30కు పైగా ఏలియన్ జాతులు ఉన్నట్లు రీసెర్చర్స్ ఓ స్టడీలో వెల్లడించారు. భూమితో పాటు ఇతర గ్రహాల్లో ఎంత మంది గ్రహాంతర వాసులు ఉంటున్నారని చేసిన రీసెర్చ్ లో కొత్త విషయాలను కనుగొన్నారు. మన పాలపుంతలో డజన్ల కొద్దీ జాతులు యాక్టివ్ స్టేట్ లో ఉన్నట్లు తెలిసింది. వాటి వయస్సు మనం ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుందని తెలిసింది.

‘అక్కడ కనీసం కొద్ది డజన్ల జాతులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా 5 బిలియన్ సంవత్సరాల నుంచి వివేకవంతమైన జీవితం గడుపుతున్నారు. కాస్మిక్ స్కేలుపై ఇదొక ఎవల్యూషన్ లా అనిపిస్తోంది. ఈ కాలిక్యులేషన్ ను ఆస్ట్రోబయోలాజికల్ కాపర్నికన్ లిమిట్ అంటారని చెబుతున్నారు. ఇవి రెండు రకాలుగా ఉండొచ్చు. 

ఒకటి 5బిలియన్ సంవత్సరాల తర్వాత జీవితం గడపేందుకు అవకాశం దొరకడం, రెండోది 4.5-5 బిలియన్ సంవత్సరాల మధ్య ఏర్పడటం. కొత్త రీసెర్చ్ ప్రకారం.. ఈ కొత్త జాతులు లోహాలతో కూడిన వాతావరణంలో జీవిస్తున్నాయి. సూర్యుడి నుంచి వచ్చే లోహాలే వాటికి ఆధారం.

2012లో చేసిన ఓ రీసెర్చ్ కూడా గ్రహాలు ఏర్పడటానికి లోహాల సహకారం ఉండాలని చెప్పారు. రీసెర్చర్స్ మిల్కీ వేలో ఎన్ని గ్రహాలు అటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయో అనే దానిపై పరిశోధనలు జరిపారు. ఎవరైనా గ్రహాంతరవాసులు ఉంటే వారికి సిగ్నల్స్ పంపి కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో పాటే గ్రహాంతరవాసులు ఒకవేళ సిగ్నల్స్ పంపితే ఎలా రిసీవ్ చేసుకోవాలా అనే దానిపై పరిశోధనలు జరుపుతున్నారు. 

మరోవైపు వారిని చేరుకోవడం కష్టంగానే అనిపిస్తుంది. యావరేజ్ గా వాళ్లు భూమికి 17వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నారు. మన కమ్యూనికేషన్ వ్యవస్థకు ఇది ఓ ఛాలెంజ్. మన పద్ధతి వాడి వారిని చేరుకోవాలనుకునేలోపు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వారితో కమ్యూనికేట్ అవడం ద్వారా వాళ్ల మనుగడ ఎలా సాధ్యమైందని తెలుసుకోవడంతో పాటు మన మనుగడ మరెన్నేళ్లు ఉంటుందో అనే అంచనాకు కూడా రావొచ్చని ప్రొఫెసర్లు అంటున్నారు.