Turkey-Syria Earthquake : టర్కీ, సిరియాలో 40,000 దాటిన మరణాలు..వారం దాటినా శిథిలాల కింద వినిపిస్తున్న సజీవ స్వరాలు

టర్కీ, సిరియాలలో భూకంపాలు సంభవించి వారం దాటుతోంది. అయినా ఇంకా శిథిలాల కింద నుంచి సజీవ స్వరాలు వినిపిస్తున్నాయి. అంటే రోజుల తరబడి శిథిలాల్లో చిక్కుకుపోయినా ప్రాణాలతో బయటపడాలనే వారి తపన అంతా ఇంతా కాదు. రెస్క్యూటీమ్ శిథిలాల్లో చిక్కుకున్నవారిని ప్రాణాలతో రక్షించాలని నిరంతరం శ్రమిస్తోంది.

Turkey-Syria Earthquake : టర్కీ, సిరియాలో 40,000 దాటిన మరణాలు..వారం దాటినా శిథిలాల కింద వినిపిస్తున్న సజీవ స్వరాలు

Turkey-Syria Earthquake

Turkey-Syria Earthquake : టర్కీ, సిరియాలలో భూకంపాలు సంభవించి వారం దాటుతోంది. అయినా ఇంకా శిథిలాల కింద నుంచి సజీవ స్వరాలు వినిపిస్తున్నాయి. అంటే రోజుల తరబడి శిథిలాల్లో చిక్కుకుపోయినా ప్రాణాలతో బయటపడాలనే వారి తపన అంతా ఇంతా కాదు. రెస్క్యూటీమ్ శిథిలాల్లో చిక్కుకున్నవారిని ప్రాణాలతో రక్షించాలని నిరంతరం శ్రమిస్తోంది. శిథిలాల కింద ఏడుపులు..రక్షించమంటూ వినిపించే స్వరాలు టర్కీ, సిరియాల విలయానికి ప్రతీకలు నిలుస్తున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న ఎంతోమంది చిన్నారులు మృత్యుంజయులుగా బయపడుతున్నారు. పసిప్రాణాలు అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా దిక్కులు చూస్తున్నాయి. మరోపక్క బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు వేదనలు..ఆవేదనలు ఇలా ఎన్నో విషాధ గాథలకు నిలువెత్తు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి భూకంప శిథిలాలు.

ఈ భూకంపాలకు 40,000మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ సంఖ్య మరింతగా పెరిగేలా ఉంది. ఎందుకంటే ఇంకా శిథిలాల కింద నుంచి శవాలు బయటపడుతున్నాయి. అలాగే ప్రాణాలతో కొంతమంది బయటపడుతున్నారు. ప్రతీ శిథిలం ఓ గాథను వినిపిస్తోంది. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ గుట్టలుగా శవాలు బయట పడుతున్నాయి. భూకంపం సంభవించి వారం తర్వాత కూడా దక్షిణ టర్కీలోని శిథిలాల కింద నుంచి ఇంకా జీవించి ఉన్నవారి గొంతులు వినిపిస్తున్నాయి.

మంగళవారం (ఫిబ్రవరి 14,2023)టర్కీలో శిథిలాల నుంచి సహాయ సిబ్బంది తొమ్మిది మందిని ప్రాణాలతో బయటకు తీయటం చూస్తే ఇంకా ఎంతమంది శిథిలాల్లో చిక్కుకుని ఉంటారో అనిపిస్తోంది. వారం రోజులుపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డారు. కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లోని అపార్ట్‌మెంట్ బ్లాక్ నుంచి రక్షించిన 17, 21 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు సోదరులు ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే అంటాక్యాలో ఓ యువకుడు,ఓ యువతిని శిథిలాల నుంచి 200 గంటల తర్వాత రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించారు. అంతేకాదు భూకంపం సంభవించిన 212 గంటల తర్వాత టర్కీలోని అడియామాన్‌లో శిథిలాల నుంచి 77 ఏళ్ల వృద్ధుడిని, మరో 18 ఏళ్ల యువకుడిని బయటకు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటువంటి పలు ఘటనతో శిథిలాల కింద ఇంకా ఎంతోమంది సజీవంగా ఉండవచ్చని సహాయ సిబ్బంది భావిస్తున్నారు. భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడటం ఓ ఎత్తైతే మరోపక్క నిరాశ్రయులుగా మారి మా జీవితాలు ఏంటో భవిష్యత్తు ఏంటో తెలియని అయోమయంగా దిక్కుతోచని స్థితిలో జీవించేవారు మరెందరో. రెండు దేశాల్లో లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఓపక్క ప్రాణాలతో బయపడటమే ఓ అద్భుతమైన తీవ్రమైన చలినుంచి ప్రాణాలకు కాపాడుకోవటం కూడా కష్టంగా మారింది. ఉండటానికి ఆశ్రయంలేక..తినటానికి తిండి లేక ప్రజలకు సహాయం కోసం నిస్సహాయంగా ఎదురు చూస్తున్నారు బాధితులు. అటువంటివారిపై టర్కీ, సిరియా ప్రభుత్వాలు దృష్టి సారించాయి.ఈ భూకంపాలకు రెండు దేశాల్లోనే 7 మిలియన్ల మంది పిల్లలు ప్రభావితమయ్యారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.