Seoul Halloween Stampede: సియోల్‌ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన కేంద్ర మంత్రి జైశంకర్.. క్లిష్ట సమయంలో అండగా ఉంటామని వెల్లడి..

దక్షిణ కొరియాలో హాలోవీన్ తొక్కిసలాట ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్ చేశారు. ‘సియోల్‌లో తొక్కిసలాట కారణంగా చాలా మంది యువకుల ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు మేము సంఘీభావంగా నిలుస్తామని కేంద్ర మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.

Seoul Halloween Stampede: సియోల్‌ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన కేంద్ర మంత్రి జైశంకర్.. క్లిష్ట సమయంలో అండగా ఉంటామని వెల్లడి..

Jaishankar

Seoul Halloween Stampede: దక్షిణ కొరియాలో హాలోవీన్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. శనివారం రాత్రి జరిగిన భయానక ఘటనలో 151 మంది మరణించారు. వీరిలో 19 మంది విదేశీలు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. అయితే వందల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

South Korea: దక్షిణ కొరియా తొక్కిసలాటలో 149కి పెరిగిన మృతుల సంఖ్య.. మరో 150 మందికి గాయాలు

హాలోవీన్ తొక్కిసలాట ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్ చేశారు. ‘సియోల్‌లో తొక్కిసలాట కారణంగా చాలా మంది యువకుల ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు మేము సంఘీభావంగా నిలుస్తాము” అని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.

హాలోవీన్ తొక్కిసలాట మృతుల్లో ఎక్కువ మంది 20 ఏళ్లలోపు వయస్సువారే నని దక్షిణ కొరియా యొక్క యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. అంతేకాకుండా, ఏజెన్సీ.. సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ ఇటావాన్ జిల్లాలో హాలోవీన్ పార్టీల సందర్భంగా జరిగిన ఘోరమైన తొక్కిసలాటకు సంబంధించి తప్పిపోయిన వ్యక్తుల గురించి 270 నివేదికలు అందాయని ఆదివారం తెలిపింది. గుర్తుతెలియని సెలబ్రిటీ ఒకరు ఇటావాన్ బార్‌ను సందర్శిస్తున్నారని విని పెద్ద సమూహం అక్కడికి చేరుకున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని అల్ జజీరా స్థానిక మీడియాను ఉటంకిస్తూ నివేదించింది.