US – China Race: సముద్రంలో కుప్పకూలిన విమానం కోసం “అమెరికా – చైనా డిష్యుం డిష్యుం”

దక్షిణ చైనా సముద్రంలో కుప్పకూలిన యుద్ధ విమానం కోసం ఈ రెండు దేశాల నావికా బృందాలు ఆఘమేఘాల మీద సముద్రంలో పరిగెత్తుతున్నాయి.

US – China Race: సముద్రంలో కుప్పకూలిన విమానం కోసం “అమెరికా – చైనా డిష్యుం డిష్యుం”

Us China

US – China Race: “సమయం లేదు మిత్రమా.. ఎవరికీ దొరికితే వారికే ఛాన్స్” అన్నట్టుగా అమెరికా చైనా నావికాదళాలు పోటీపడుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో కుప్పకూలిన యుద్ధ విమానం కోసం ఈ రెండు దేశాల నావికా బృందాలు ఆఘమేఘాల మీద సముద్రంలో పరిగెత్తుతున్నాయి. కుప్పకూలిన విమాన శఖలాలను ముందుగా ఎవరు చేజిక్కించుకుంటారో అనే ఉత్కంఠ ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనూ నెలకొంది. అంతలా ఉత్కంఠ కలిగించే విషయం ఇందులో ఏముంది? అంటే..

Also read: Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు

అమెరికా నావికాదళానికి చెందిన USS కార్ల్ విన్సన్ అనే విమాన వాహక నౌక ఇటీవల అంతర్జాతీయ జలాల్లో పలు విన్యాసాలు నిర్వహించింది. ఈక్రమంలో వాహక నౌకలోని F35-C అనే జెట్ విమానం..మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలో దక్షిణ చైనా సముద్రంలో కుప్పకూలింది. వాహకనౌక విన్సన్ నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో F35-C కుప్పకూలినట్లు జనవరి 24 నాడు యూఎస్ నేవీ అధికారులు గుర్తించారు. ఈఘటనలో మొత్తం ఏడుగురు విమాన సిబ్బంది గాయపడ్డారు. సముద్రంలోని ఒక చిన్న పాటి చీలిక వద్ద విమాన శఖలాలను గుర్తించిన అధికారులు ఆ విమానం మరో పదిరోజుల్లో పూర్తిగా నీటిలో మునిగిపోతుందని, ఈలోగా దాన్ని వెలికి తీయాలని భావిస్తున్నారు.

F35-C విమాన ప్రత్యేకతలు:
ఇరు దేశాలు నువ్వా నేనా అన్నంతగా పోటీపడుతున్న F35-C విమానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 1,200 mph, లేదా Mach 1.6 దూసుకువెళ్ళే ఈ F35-C విమానంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ ఉంది. విమానం రెండు రెక్కలపై రెండు, లోపలి భాగంలో నాలుగు మధ్యశ్రేణి మిస్సైల్స్ ను ఇది మోసుకెళ్లగలదు. ముఖ్యంగా అమెరికా నావికాదళానికి సమాచారం చేరవేసే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఈ విమానంలో ఉంది. షూటర్‌లకు అవసరమైన సమాచారం అందించేందుకు సహాయపడే సెన్సార్‌లు ఉన్న ఈ F35-C విమానం ద్వారా మిస్సైల్ షూటింగ్ కు సంబంధించి ఇతర పైలట్లకు సమాచారం చేరవేయొచ్చు. అందుకే దీన్ని ముద్దుగా.. “ఎగిరే కంప్యూటర్ గా” అభివర్ణించారు డిఫెన్సె కన్సల్టెంట్ అబి ఆస్టెన్.

Also read: Corona India: దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత, కొత్తగా ఎన్నంటే?

అయితే ఇక్కడ చైనా ప్రమేయం ఎందుకు వచ్చింది? అంటే.. అంతర్జాతీయ జలాల్లో ఏదైనా వస్తువులు దొరికినట్లయితే ఎవరికైనా వాటిని తీసుకు వెళ్లే హక్కు ఉంటుంది. అందులోనూ దక్షిణ సముద్రం భాగమంతా తమదే అంటూ 2016 నుంచి చైనా వాదిస్తుంది. ఈక్రమంలో ముందుగా ప్రమాద స్థలికి చేరుకుని F35-C విమాన శఖలాలను ఎత్తుకువెళ్లాలని చైనా నేవీ భావిస్తుంది. అదే సమయంలో చైనా బలగాలు అక్కడికి చేరుకునేందుకు మరో పది రోజులు పడుతుంది. దీంతో ఎలాగైనా ఆ F35-C విమాన శఖలాలను వశం చేసుకునేందుకు ఇరు దేశాల నావికాదళాలు పోటాపోటీగా పరిగెత్తుతున్నాయి. పైగా F35-C విమానంలో ఉన్న సాంకేతికత చైనా వద్ద లేదు. దీంతో ఎలాగైనా ఆ విమాన శఖలాలను ఏరుకుని ఆ సాంకేతికతను దక్కించుకోవాలని చైనా తాపత్రయం. అదే గనక జరిగితే.. విమాన సాంకేతికతే కాదు.. అమెరికా నావికాదళానికి సంబంధించి కీలక సమాచారం కూడా చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుందని.. తద్వారా చైనా మరింత బలపడుతుందని అబి ఆస్టెన్ పేర్కొన్నారు.

Also read: Wooden Chair: పాత సామాను షాపులో రూ.500కు కొన్న కుర్చీ వేలంలో రూ.16లక్షలు

చైనా నావికాదళం వస్తుందన్న వార్తలు అమెరికా నావికాదళానికి తెలిసింది. దీంతో ఎలాగైనా మరో పది రోజుల్లోగా F35-C విమానం కూలిన ప్రాంతానికి చేరుకుని విమాన శకలాలను అందుకోవాలని యూఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ పది రోజుల్లోగా చేరుకోకపోతే.. విమానంలోని “బ్లాక్ బాక్స్” (రహస్య సమాచార వ్యవస్థ కలిగిన పెట్టె) ఉప్పు నీటిలో మునిగి అందులోని సమాచారం పూర్తిగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని డిఫెన్సె కన్సల్టెంట్ అబి ఆస్టెన్ చెప్పుకొచ్చారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా అక్కడికి చేరుకొంటారోనని ప్రపంచ దేశాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Also read: Corona in Britain: కరోనా మాస్క్ ఆంక్షలు ఎత్తివేసిన ఇంగ్లాండ్