US Prisoners..Organs Donating : అమెరికాలో అవయవదానం చేసే ఖైదీలకు శిక్ష తగ్గింపు..బిల్లు ప్రతిపాదనపై దుమారం

అవయవ దానంతో మానవత్వం కనబరిచే ఖైదీల శిక్ష తగ్గించేందుకు రూపొందించబడిన ఓ బిల్లు అమెరికాలో దుమారం రేపుతోంది. అవయవదానం చేయటానికి ముందుకొచ్చి సంబంధిత పత్రాలపై సంతకం చేస్తే శిక్షలను తగ్గించేలా మసాచుసెట్స్ రాష్ట్ర చట్టసభ సభ్యులు కొంతమంది ఈ బిల్లును ప్రతిపాదించారు.

US Prisoners..Organs Donating : అమెరికాలో అవయవదానం చేసే ఖైదీలకు శిక్ష తగ్గింపు..బిల్లు ప్రతిపాదనపై దుమారం

prisoners donating their organs

US Prisoners..Organs Donating : అవయవ దానంతో మానవత్వం కనబరిచే ఖైదీల శిక్ష తగ్గించేందుకు రూపొందించబడిన ఓ బిల్లు అమెరికాలో దుమారం రేపుతోంది. అవయవదానం చేయటానికి ముందుకొచ్చి సంబంధిత పత్రాలపై సంతకం చేస్తే శిక్షలను తగ్గించేలా మసాచుసెట్స్ రాష్ట్ర చట్టసభ సభ్యులు కొంతమంది ఈ బిల్లును ప్రతిపాదించారు. పాలక పక్ష, ప్రతిపక్ష పార్టీ సభ్యుల్లో కొందరు ఉమ్మడిగా ఈ బిల్లును ప్రతిపాదించారు. అవయవదానం లేదా బోన్ మ్యారో(ఎముక మూలుగ)ను దానం చేసిన ఖైదీల శిక్ష తగ్గించాలనేది ఈ బిల్లు ముఖ్య ఉద్ధేశ్యం. దీనికి అంగీకరించిన ఖైదీలకు రెండు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు శిక్ష తగ్గించేలా ఈ బిల్ల ప్రతిపాదన ఉంది. మసాచుసెట్స్ రాష్ట్ర చట్టసభలో డెమోక్రాటిక్ ప్రతినిధి కార్లోస్ గొంజాలెజ్ ఈ బిల్లును ప్రతిపాదించారు.

ఈబిల్లు అనైతికమని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవయవదానం చేయడాన్ని నిషేధించిన ఫెడరల్ ప్రభుత్వ చట్టానికి ఇది వ్యతిరేకమని ‘క్విడ్ ప్రోకో‘ అంటూ విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై కార్లోస్ గొంజాలెజ్ మాట్లాడుతు ఇటువంటి విమర్శలతో జైలులో ఉన్న ఖైదీలను దాతలుగా ఉండకుండా ఏ చట్టమూ నిరోధంచలేదు అని అన్నారు. మసాచుసెట్స్ లో ఉన్న ప్రతీపౌరుడికి ఉండ ప్రాథమిక హక్కలు జైలులో ఉండే ఖైదీలకు కూడా ఉండాలన్నారు. కానీ కొంతమంది పరిశీలకులు మాత్రం అవయవదానం తరువాత ఖైదీలకు జైళ్లలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం అధికారుల ముందున్న మరో సవాల్ అని అంటున్నారు.

కాగా..మసాచుసెట్స్ జైళ్లలోని ఖైదీల్లో ఎక్కువశాతం నల్లజాతీయులు, లాటిన్ అమెరికా సంతతి వారే ఉన్నారు. దీంతో.. ఈ బిల్లు వల్ల మైనారిటీలకు అన్యాయం జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ఈ బిల్లును ఆమోదం అంత సులువుకాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.