మిలియన్ల స్మార్ట్ ఫోన్లలో నిలిచిపోయిన వాట్సాప్

  • Published By: sreehari ,Published On : February 4, 2020 / 12:48 PM IST
మిలియన్ల స్మార్ట్ ఫోన్లలో నిలిచిపోయిన వాట్సాప్

ప్రపంచవ్యాప్తంగా మెసేంజర్ యాప్ వాట్సాప్ సర్వీసులు మిలియన్ల స్మార్ట్ ఫోన్లలో నిలిచిపోయాయి. సెక్యూరిటీ అప్ డేట్స్ నిలిచిపోయిన పాత ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ఫిబ్రవరి 1 నుంచి సర్వీసులను నిలిపివేసింది. అప్‌డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యే స్మార్ట్ ఫోన్లలోనే వాట్సాప్ సేవలను వినియోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో వెర్షన్ 4.0.3 లేదా ఆపై వెర్షన్, ఐఫోన్లలో iOS 9 లేదా ఆపై వెర్షన్లలో మాత్రమే వాట్సాప్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

కొన్ని నిర్దిష్ట ఫోన్లలో KaiOS 2.5.1 లేదా ఆపై వెర్షన్, జియో ఫోన్, జియో ఫోన్ 2 లో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన స్మార్ట్ ఫోన్లలో అప్ డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లు ఉండటంతో వీటిన్నింటికి వాట్సాప్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఏదిఏమైనా.. వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ యజమానుల్లో ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.7 లేదా అంతకంటే ముందు, iOS 8 అంతకంటే ముందు వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యే స్మార్ట్ ఫోన్లలో ఫిబ్రవరి 1 వరకు మాత్రమే వాట్సాప్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 

గూగుల్ డిస్ట్రిబ్యూషన్ డ్యాష్ బోర్డు ప్రకారం.. ప్రపంచంలోని ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్లు Gingerbread 2.3.7 లేదా అంతకంటే ముందు వెర్షన్ రన్ అయ్యే స్మార్ట్ ఫోన్లు 0.3 శాతంతో 2.5 బిలియన్లు (75 మిలియన్లు)గా ఉన్నట్టు మే 2019 డేటాలో వెల్లడించింది. ఆపిల్ తమ ఐఫోన్ మోడల్ యూజర్లు ఎంతమంది ఐఓఎస్ 8 లేదా అంతకంటే ముందు వెర్షన్ వాడుతున్నారో వెల్లడించలేదు.

లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే స్మార్ట్ ఫోన్ యూజర్లకు వాట్సాప్ మాత్రమే కాదు.. అవసరమైన సెక్యూరిటీ అప్ డేట్స్ కూడా అందిస్తోంది. గూగుల్, ఆపిల్ డెవలప్ చేసిన లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లు పొందే స్మార్ట్ ఫోన్లకు మాత్రమే భద్రత ఉంటుంది. అందుకే వాట్సాప్ తమ సేవలను కొనసాగిస్తోంది. సెక్యూరిటీ అప్ డేట్స నిలిచిపోయిన స్మార్ట్ ఫోన్లకు సర్వీసులను వాట్సాప్ నిలిపివేసింది. 2019లో వాట్సాప్ అత్యధికంగా 850 మిలియన్లకు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని ఇంటెలిజెన్స్ డేటా డైజెస్ట్ రిపోర్టు తెలిపింది. ఆ తర్వాత బైట్ డ్యాన్స్ యాప్ టిక్ టాక్ 700 మిలియన్ల డౌన్ లోడ్లతో రెండో స్థానంలో నిలిచింది.