Queen Elizabeth-2: క్వీన్ ఎలిజబెత్ -2ను ఖననంచేసే స్థలం ఎక్కడ ఉంది? దాని ప్రాముఖ్యత ఏమిటి?.. ఇక్కడ ఎన్నో శుభకార్యాలు కూడా..

96 సంవత్సరాల వయస్సులో గతవారం క్విన్ ఎలిజబెత్ -2 కన్నుమూశారు. దివంగత క్వీన్‌కు ఇష్టమైన ప్రాంతాల్లో ఒకటి విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌. ఇందులో ఆమెను ఖననం చేయనున్నారు. ఎలిజబెత్-2 కంటే ముందు అనేక మంది రాజ కుటుంబీకుల అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించారు.

Queen Elizabeth-2: క్వీన్ ఎలిజబెత్ -2ను ఖననంచేసే స్థలం ఎక్కడ ఉంది? దాని ప్రాముఖ్యత ఏమిటి?.. ఇక్కడ ఎన్నో శుభకార్యాలు కూడా..

Queen Elizabeth-2

Queen Elizabeth-2: 96 సంవత్సరాల వయస్సులో గతవారం క్విన్ ఎలిజబెత్ -2 కన్నుమూశారు. దివంగత క్వీన్‌కు ఇష్టమైన ప్రాంతాల్లో ఒకటి విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌. ఇందులో ఆమెను ఖననం చేయనున్నారు. ఎలిజబెత్-2 కంటే ముందు అనేక మంది రాజ కుటుంబీకుల అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించారు. వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో అంత్యక్రియల తర్వాత క్వీన్స్ శవపేటిక సెంట్రల్ లండన్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న విండ్సర్ కాజిల్‌కు తరలిస్తారు.

Queen Elizabeth-2 Funeral: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల ఊరేగింపు‌ను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన బ్రిటన్ ప్రజలు.. ఫొటో గ్యాలరీ

సెయింట్ జార్జ్ ప్రార్థనా మందిరంలో కింగ్ జార్జ్ -6 మెమోరియల్ చాపెల్‌తో సహా అనేక విభాగాలు, మూలలు ఉన్నాయి. చాపెల్‌లోకి తీసుకెళ్లిన తర్వాత చివరగా రాయల్ వాల్ట్‌లో రాణి శవపేటికను ఉంచుతారు. రాణి తన తండ్రి మరణం తర్వాత దీనిని ఏర్పాటు చేసింది. సెయింట్ జార్జ్ చాపెల్ క్రింద ఉన్న రాయల్ వాల్ట్‌లోని ఒక గదిలో రాజ కుటుంబానికి చెందిన 24 మందిని ఖననం చేశారు. 2021లో రాణి ఎలిజబెత్-2 భర్త ను అక్కడే ఖననం చేశారు. ఆయన శవపేటిక వద్దనే రాణి ఎలిజబెత్ -2 శవపేటికను ఉంచుతారు.

Queen Elizabeth-2 Funeral: నేడే బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. ఏ సమయానికంటే?

– సెయింట్ జార్జ్ చాపెల్‌తో రాజకుటుంబానికి సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది.
– ఇది కేవలం శ్మశానవాటికగా మాత్రమే కాకుండా వివాహాలు, నామకరణాలు, అంత్యక్రియలకు సంబంధించిన ప్రదేశం.
– 1937మే 12న చర్చిలో కింగ్ జార్జ్ -6 (ఎలిజబెత్-2 తండ్రి) పట్టాభిషేకం చేశారు.
– చాపెల్ నిర్మాణం మొదట 1475లో కింగ్ ఎడ్వర్డ్ -4 పాలనలో ప్రారంభమైంది. కింగ్ హెన్రీ-8 ఆధ్వర్యంలో 1528లో పూర్తయింది.
– 1947 నవంబర్ 20న క్వీన్ ఎలిజబెత్-2 ప్రిన్స్ ఫిలిప్‌ను ఇక్కడే వివాహం చేసుకుంది.
– 1953 జూన్2న క్వీన్ ఎలిజబెత్ -2 పట్టాభిషేకం దాదాపు మూడు గంటలపాటు ఈ చర్చిలోనే రిగింది.
– ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే 2018లో అక్కడే వివాహం చేసుకున్నారు.
– క్వీన్ ఎలిజబెత్ -2 తల్లి 2002లో మరణించిన తర్వాత ప్రార్థనా మందిరంలో ఖననం చేశారు. ఆమె సోదరి ప్రిన్సెస్ మార్గరెట్ వారి తల్లికి కంటే కొన్ని వారాల ముందు వెళ్ళిన – కూడా ప్రార్థనా మందిరంలో ఖననం చేశారు.
– 2011 సంవత్సరంలో ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో వివాహం చేసుకున్నారు.
– ప్రస్తుత కింగ్ చార్లెస్-3 క్వీన్ కన్సార్ట్ కెమిల్లా కూడా 2005లో వారి వివాహం తర్వాత ప్రార్థనా మందిరంలో ఒక సేవను నిర్వహించారు.
– 2021లో మరణించిన ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్‌ ఖననం అక్కడే నిర్వహించారు. అయితే రాణి ఎలిజబెత్ ఈ ఏడాది మార్చిలో వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బే వద్ద చివరిసారిగా సందర్శించారు.
– ప్రార్థనా మందిరం రాజ కుటుంబానికి కేటాయించబడిన ప్రార్థనా స్థలం. అలాగే స్థానిక సమాజానికి సేవ చేసే చర్చి.
– రాజులచే నిర్మించబడింది. రాజకుటుంబ చరిత్ర ఆధారంగా రూపొందించబడింది.
– సెయింట్ జార్జ్ చాపెల్ ప్రతివారంలో అనేక రోజులు ప్రజల సందర్శనార్ధం తెరిచి ఉంటుంది. ఎలిజబెత్ -2కి నివాళులు అర్పించాలని కోరుకునే ఎవరైనా ఆమె ఖననం ముగిసిన తర్వాత అక్కడికి వెళ్లవచ్చు.