Queen Elizabeth-2 Funeral: నేడే బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. ఏ సమయానికంటే?

బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. రాచరిక సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ రాణికి సోమవారం తుది వీడ్కోలు పలకనున్నారు. రాణి అంత్యక్రియల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

Queen Elizabeth-2 Funeral: నేడే బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. ఏ సమయానికంటే?

Queen Elizabeth II’s funeral

Queen Elizabeth-2 Funeral: బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. రాచరిక సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ రాణికి సోమవారం తుది వీడ్కోలు పలకనున్నారు. రాణి అంత్యక్రియల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. 500మందికిపైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు బ్రిటన్ చేరుకున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతమంది దేశాధినేతలు ఒక్కచోట కలుస్తున్న సందర్భం ఇదే.

Queen Elizabeth II Funeral: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు.. బ్రిటన్ అన్ని కోట్లు ఖర్చు చేస్తుందా!

ప్రజలు రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యూకేలోని పార్కుల్లో పెద్ద స్క్రీన్‌ల ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి దాదాపు 125 సినిమా థియేటర్లు సిద్ధమయ్యాయి. తమ ప్రియతమ రాణిని కడసారి చూసుకునేందుకు గడ్డకట్టించే చలిలోనూ బ్రిటన్ వాసులు బారులు తీరారు. ఆదివారం రాత్రి దేశవ్యాప్తంగా నిమిషం పాటు మౌనం పాటించారు. మరోవైపు దేశం నలుమూలల నుంచి సుమారు 10లక్షల మంది ఎలిజబెత్-2 అంత్యక్రియలు చూసేందుకు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లండన్ లో 36 కిలో మీటర్ల మేర బ్యారికేడ్లు నిర్మించారు.

Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లండన్ చేరుకున్న భారత రాష్ట్రపతి

రాణి అంత్యక్రియలకు భారీగా ఖర్చు చేస్తున్నారు. రాణి శ‌వ‌పేటిక‌పై 2868 వజ్రాలు 17 నీలమణులు 11 మరకత మణులు, 269 ముత్యాలు, 4 రూబీలు పొదిగిన రాణి కిరీటాన్ని ఉంచారు. యూకే మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. బ్రిటన్ ప్ర‌భుత్వం దాదాపు 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) ఖ‌ర్చు చేస్తుంది.

Queen Elizabeth : క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు ఆ మూడు దేశాలకు అందని ఆహ్వానం .. కారణం చాలా కీలకమే

వెస్ట్ మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబే వరకూ రాణి శవపేటిక ఊరేగింపు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై గంట వ్యవధిలో పూర్తవుతుంది. అక్కడ నుంచి వెల్లింగ్టన్ ఆర్చి వరకు సాగే అంతిమయాత్ర 12.15గంటలకు మొదలవుతుంది. అక్కడి నుండి మధ్యాహ్నం 3.40గంటలకు విండ్సర్స్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌కు రాణి శవపేటికను అంతిమయాత్రగా తీసుకెళ్తారు. ఇందులో కింగ్ ఛార్లెస్3తో పాటు రాజ కుటుంబం కూడా పాల్గొంటుంది. కింగ్ జార్జ్ 6 మెమోరియల్ చాపెల్‌లోకి తీసుకెళ్లిన తర్వాత సాయంత్రం 4గంటలకు రాయల్ వాల్ట్ లో క్విన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్‌ను ఉంచిన దగ్గర రాణి శవపేటికను ఉంచుతారు. అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత రెండు నిమిషాలు అందరూ మౌనం పాటిస్తారు.

Queen Elizabeth : క్వీన్ ఎలిజ‌బెత్ మరణం .. ఆమె ముద్ర ఉన్న 95 బిలియ‌న్ల డాల‌ర్ల నోట్లు చెల్లుతాయా లేదా? బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఏం చెబుతోంది?

విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జి చాపెల్‌లో జరిగే నిబద్ధత సర్వీసులో 800 మంది అతిథులు పాల్గొంటారు. ఇందుకోసం పదివేల మంది పోలీసు అధికారులు లండన్ వీధుల్లో విధులు నిర్వహిస్తారు. భారీ భద్రత నడుమ రాణి ఊరేగింపు కొనసాగుతుంది. 1650 మంది సైనికులు రాణి శవపేటిక ఊరేగింపు కార్యక్రమ విధుల్లో పాల్గొంటారు. ఇదిలాఉంటే క్వీన్ ఎలిజబెత్ 70 సంవత్సరాల 214 రోజులు పాలించారు. ప్లాటినం జూబ్లీని జరుపుకున్న మొదటి బ్రిటిష్ సార్వభౌమాధికారి. ఆమె 96వ ఏట సెప్టెంబర్ 8న స్కాట్ లాండ్‌లో కన్నుమూసిన విషయం విధితమే.