Boat Sank: బాబోయ్.. చూస్తుండగానే సముద్రంలో మునిగిన బోట్.. ఆ సమయంలో బోట్‌లో తొమ్మిది మంది.. వీడియో వైరల్ ..

సముద్రంలో పెద్ద‍‌పెద్ద బోట్‌లు మునిగిపోయే దృశ్యాలు మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు చూసే వీడియోలో 130 అడుగుల బోట్ మధ్యదరా సముద్రంలోకి మెల్లిగా మునిగిపోతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Boat Sank: బాబోయ్.. చూస్తుండగానే సముద్రంలో మునిగిన బోట్.. ఆ సమయంలో బోట్‌లో తొమ్మిది మంది.. వీడియో వైరల్ ..

boat sank

Boat Sank: సముద్రంలో పెద్ద‍‌పెద్ద బోట్‌లు మునిగిపోయే దృశ్యాలు మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు చూసే వీడియోలో 130 అడుగుల బోట్ మధ్యదరా సముద్రంలోకి మెల్లిగా మునిగిపోతూ కనిపించింది. అయితే అందులో ప్రయాణించే నలుగురు ప్రయాణీకులు, ఐదుగురు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సముద్ర తీరానికి 14.5 కిలోమీటర్ల దూరంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ బోట్ ఎందుకు సముద్రంలో అలా మునిగిందనే విషయాలను తెలుసుకొనేందుకు దర్యాప్తు మొదలైంది.

Viral Video: బీచ్‌లో బికినీలతో అందగత్తెలు సందడి చేస్తుంటే.. చీరకట్టులో మహిళ ఎంట్రీ.. కళ్లన్నీ అటువైపే

ఓ సూపర్‌యాచ్‌ మధ్యధరా సముద్రంలోకి మునిగిపోయినట్లు చూపించే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఇటాలియన్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 130 అడుగుల పడవ నీటి అడుగున వెళుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. కోస్ట్ గార్డ్ బోట్‌లోని మొత్తం తొమ్మిది మందిని రక్షించారు. బోటు గల్లిపోలి నుంచి మిలాజోకు వెళుతుండగా మునిగిపోయిందని స్థానిక మీడియా తెలిపింది. బోట్ ఎందుకు మునిగిందనే విషయాన్ని తెలుసుకొనేందుకు అడ్మినిస్ట్రేటివ్ దర్యాప్తు ప్రారంభించింది.

ఇదిలాఉంటే ఈ బోట్ వాతావరణం, సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్లనే సముద్రంలో మునిగిపోయి ఉంటుందని తెలుస్తోంది. అయితే 2007లో మొనాకోలో నిర్మించిన ఈ పడవకు ‘సాగా’ అని పేరు పెట్టారు. బోట్ మునిగిపోవడానికి గల కారణాలను కనుగొనే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇటాలియన్ కోస్ట్ గార్డ్ ప్రకారం.. వారు ఫుటేజీని కూడా విశ్లేషిస్తున్నారు.