Omicron Variant: గతంలో లేనంత వేగంగా.. 77దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్

కరోనా ఫస్ట్ వేవ్ వేరియంట్.. సెకండ్ వేవ్ లో బీటా వేరియంట్ లు లేనంత వేగంగా విజృంభిస్తుంది ఒమిక్రాన్. దాదాపు మూడో వేవ్ రాబోతుందని సూచిస్తున్న నిపుణుల వర్గాలు పలు జాగ్రత్తలు తప్పనిసరి.

Omicron Variant: గతంలో లేనంత వేగంగా.. 77దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్

Omicron Variant: కరోనా ఫస్ట్ వేవ్ వేరియంట్.. సెకండ్ వేవ్ లో బీటా వేరియంట్ లు లేనంత వేగంగా విజృంభిస్తుంది ఒమిక్రాన్. దాదాపు మూడో వేవ్ రాబోతుందని సూచిస్తున్న నిపుణుల వర్గాలు పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 77దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది.

చాలా దేశాల్లో బయటపడనప్పటికీ చాపకింద నీరులా పాకిపోయిందంటూ కామెంట్లు చేశారు డా. టెడ్రోస్. పైగా ఇంత వేగంగా గతంలో ఏ వేరియంట్ విస్తరించలేదని వెల్లడించారు.

‘చాలా మంది ఒమిక్రాన్ ను చాలా తేలికగా తీసుకుంటున్నారు. వ్యాక్సిన్లు తీసుకుని యాంటీబాడీలు ఉన్న వారిలో ఒక్కోసారి వైరస్ ప్రభావం అంతగా కనిపించకపోయినా… ఇతరులకు వ్యాపించే అవకాశాలు లేకపోలేదు. సరైన జాగ్రత్తలు తీసుకోని హెల్త్ సిస్టమ్స్ ను అందుకే హెచ్చరిస్తున్నా’ అని అన్నారు డా.టెడ్రోస్.

……………………………………. : కరణ్ జోహార్ పార్టీతో బాలీవుడ్‌లో కరోనా కలకలం
‘వ్యాక్సిన్లు వేసుకుంటే మాత్రమే సరిపోదు.. ఏ దేశం వారైనా దాంతో పాటు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.’ డా.టెడ్రోస్