World population..UN : 2022 నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా.. 2023లో చైనాను దాటేయనున్న భారత్

ప్రపంచ జనాభా మరో నాలుగు రోజుల్లో 800 కోట్లకు చేరనుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. అంటే మరో 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరనుంది.. 2030 నాటికి ఈ సంఖ్య సుమారు 850 కోట్లకు పెరుగుతుందని అంచనావేసింది.

World population..UN : 2022 నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా.. 2023లో చైనాను దాటేయనున్న భారత్

World Population To Reach 8 Billion On November 15, Says UN Report

Updated On : November 11, 2022 / 1:08 PM IST

World population..UN : ప్రపంచ జనాభా మరో నాలుగు రోజుల్లో 800 కోట్లకు చేరనుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. అంటే మరో 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరనుంది.. ఈ లెక్క ఇది 1950తో పోలిస్తే మూడు రెట్లు అధికమని వెల్లడించింది. 2030 నాటికి ఈ సంఖ్య సుమారు 850 కోట్లకు పెరుగుతుందని అంచనావేసింది. 2030 నాటికి ప్రపంచ జనాభా 850 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఎక్కువ జనాభా కలిగిన దేశంగా చైనా ఉందని… 2023లో చైనాను భారత్ అధిగమిస్తుందని తెలిపింది. అంటే మరో ఏడాదిలోనే జనాభా సంఖ్యలో భారత్ చైనాను దాటేయనుంది.

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌-2022 పేరుతో ఈ ఏడాది జులై 11న ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదల చేసింది. 2020లో జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా నమోదయిందని అందులో తెలిపింది. 1950 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారని పేర్కొన్న యూఎన్ నవంబర్‌ 15 నాటికి ప్రపంచ మొత్తం జనాభా 800 కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది.

ఇక ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లకు చేరుకుంటుందని వెల్లడించింది. 2050 నాటికి ఈ సంఖ్య 9.7 బిలియన్లకు, 2080లో 10.4 బిలియన్లు, 2100 నాటికి11.2 బిలియన్లు దాటుతుందని అంచనా వేసింది. కాగా, వచ్చే 30 ఏండ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50 శాతానికిపైగా కేవలం 8 దేశాల్లోనే సంభవిస్తుందని నివేదిక వెల్లడించింది. కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల్లోనే ఈ అధిక జనాభా రేటు ఉంటుందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.