World Without Tomatoes: కాలుష్యం ఇలాగే పెరిగితే టమాటాల్లేని ప్రపంచం చూడాల్సి వస్తుంది : శాస్త్రవేత్తల హెచ్చరిక

కాలుష్యం ఇలాగే పెరిగితే టమాటాల్లేని ప్రపంచం చూడాల్సి వస్తుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

World Without Tomatoes: కాలుష్యం ఇలాగే పెరిగితే టమాటాల్లేని ప్రపంచం చూడాల్సి వస్తుంది : శాస్త్రవేత్తల హెచ్చరిక

World Without Tomatoes

World Without Tomatoes: కాలుష్యం పెరిగిపోతోంది..పర్యావరణం దెబ్బతింటోంది. ఇది మానవాళికి ఎంతో ప్రమాదకరం అని పర్యావరణ వేత్తలు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. కాలుష్యం పెరిగిపోవటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కానీ ఎంతమాత్రం మార్పు రావటంలేదు. కానీ కాలుష్యం ఇలాగే పెరిగిపోతూ ఉంటే ఇక ప్రపంచంలో టమాటాలు అనేవి కనిపించవని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేసింది. కాలుష్యం ఇలాగే పెరిగుపోతుంటే టమాటాలు లేని ప్రపంచాన్ని చూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

కాలుష్యాన్ని పెంచుకుంటూపోతే పర్యావరణానికి హాని జరగటమే కాదు టమాటాలు లేని ప్రపంచాన్ని చూడటానికి సిద్ధంగా ఉండాలని డెన్మార్క్‌ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. వాతావరణ మార్పుల కారణంగా టమాటాల ఉత్పత్తి తగ్గిపోతోందని..రాబోయే ముప్పై ఏళ్లలో సగానికి పడిపోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా మనం ప్రతీరోజు టమాటాను ఏదో విధంగా వాడుతుంటాం. దాదాపు అన్ని రకాల వంటకాల్లోను టమాటాలు వినియోగిస్తుంటాం. అటువంటి టమాటా ధర ఎక్కువపలికితే కొనలేక ధరలు మండిపోతున్నాయని గగ్గోలు పెడుతుంటాం. అటువంటిది ఇక టమాటాలు పండే అవకాశమే ఉండదంటే..ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోమంటు సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.

డెన్మార్క్‌లోని ఆర్హస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఉష్ణోగ్రతలు పెరిగితే టమాటా ఉత్పత్తిపై ఎలా ప్రభావం పడుతుందన్నదానిపై విశ్లేషించారు. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలను దాటితే 2050కల్లా టమాటా ఉత్పత్తి సగానికి పడిపోతుందన్నారు. భారత్‌లో ఇటీవల వడగాలుల కారణంగా టమాటా ఉత్పత్తి తగ్గి ధరలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.

ఇటలీ, చైనా,కాలిఫోర్నియాలు టొమాటో ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయని – ప్రపంచ ఉత్పత్తిలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయని శాస్త్రవ్తేతలు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ముప్పు పొంచి ఉన్నందని తద్వారా టమాటాల ఉత్పత్తి తగ్గిపోతుందని అధ్యయనం తెలిపింది. 2050-2100 మధ్య పంట సగానికి సగం తగ్గిపోతుందని పరిశోధకులు అంచనా వేశారు. ఈ అధ్యయనం ప్రకారం..2050 నాటికి టమోటా ఉత్పత్తి ఆరు శాతం తగ్గుతుందని తెలిపారు.