పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ సర్జరీ సక్సెస్

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ సర్జరీ సక్సెస్

Kl Rahul

IPL 2021 – KL Rahul: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు సక్సెస్ ఫుల్ గా సర్జరీ పూర్తి చేశారు. ముంబైకి చార్టర్ ఫ్లైట్ ద్వారా వెళ్లిన రాహుల్ కు లాప్రోస్కోపిక్ అపెండెక్టామీ జరిగింది. ఒకవారం గ్యాప్ లోనే తిరిగి మ్యాచ్ లో జాయిన్ అయ్యేలా డాక్టర్ల టీం పనిచేసింది. రాహుల్ క్వారంటైన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఇతర ప్రొటోకాల్స్ అన్ని పాటించిన తర్వాతనే టీం బబుల్ లోకి ఎంటర్ అవుతాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆదివారం పంజాబ్ కింగ్స్ ఆడిన చివరి మ్యాచ్ లోనే రాహుల్ కు అపెండిసైటిస్ వచ్చిందని, ఆ సమస్యతో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడని శనివారమే చెప్పారు. ఏప్రిల్ 30న ఆర్సీబీతో ఆడిన మ్యాచ్ లో 91పరుగులు చేశాడు రాహుల్.

ఈ టోర్నమెంట్ లో జరిగిన ఏడు ఇన్నింగ్స్ లలో రాహుల్ 331పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. వీలైనంత త్వరగా మైదానంలో అడుగుపెట్టి పంజాబ్ కింగ్స్ జట్టుకు సపోర్ట్ ఇస్తాడని ఆశిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. జరిగిన ఎనిమిది గేమ్స్ లో మూడు మాత్రమే గెలిచింది పంజాబ్.

రాహుల్ లేకపోవడంతో మాయంక్ అగర్వాల్ ను కెప్టెన్ గా నియమించారు. ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 58బంతులకు గానూ 99 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.