Ravi Shankar Prasad: “బాధ్యతారహిత, సిగ్గుమాలిన వ్యాఖ్యలు” అంటూ రాహుల్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం

"ఖర్గే జీ... కాంగ్రెస్ అధ్యక్షుడిగా మిమ్మల్ని నిజంగా మీ పార్టీ నేతలే ఎన్నుకున్నారని మీరు భావిస్తే మీరు ఓ విషయంపై స్పందించండి. రాహుల్ గాంధీ చేసిన బాధ్యతారహిత, సిగ్గుమాలిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? భారత్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి అమెరికా, యూరప్ జోక్యం చేసుకోవాలని రాహుల్ అన్నారు. రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను సమర్థించకపోతే దాన్ని ఖండిస్తున్నట్లు ఖర్గే చెప్పాలి'' అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

Ravi Shankar Prasad: “బాధ్యతారహిత, సిగ్గుమాలిన వ్యాఖ్యలు” అంటూ రాహుల్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం

Ravi Shankar Prasad

Ravi Shankar Prasad: యూకే పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ లో పరిస్థితులు, సరిహద్దుల్లో చైనాతో గొడవ వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మావోయిస్టు భావజాలంతో మాట్లాడారని విమర్శించారు.

“ఖర్గేజీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మిమ్మల్ని నిజంగా మీ పార్టీ నేతలే ఎన్నుకున్నారని మీరు భావిస్తే మీరు ఓ విషయంపై స్పందించండి. రాహుల్ గాంధీ చేసిన బాధ్యతారహిత, సిగ్గుమాలిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? భారత్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి అమెరికా, యూరప్ జోక్యం చేసుకోవాలని రాహుల్ అన్నారు.

రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను సమర్థించకపోతే దాన్ని ఖండిస్తున్నట్లు ఖర్గే చెప్పాలి. సోనియా గాంధీ జీ.. దీనిపై మీ వైఖరి ఏంటో స్పష్టం చాలని బీజేపీ మిమ్మల్ని కోరుతోంది. మీ కుమారుడు చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలపై మీ తీరు ఏంటో చెప్పాలి” అని రవిశంకర్ ప్రసాద్ నిలదీశారు.

కాగా, సరిహద్దుల్లో చైనా ఆగడాలపై కూడా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విదేశాల్లో పర్యటిస్తూ భారత్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

Rahul Gandhi: ‘చైనా అచ్చం అలాగే బెదిరిస్తోంది’ అంటూ భారత్ ను ఉక్రెయిన్ తో పోల్చుతూ రాహుల్ వ్యాఖ్యలు