Rahul Gandhi: ‘చైనా అచ్చం అలాగే బెదిరిస్తోంది’ అంటూ భారత్ ను ఉక్రెయిన్ తో పోల్చుతూ రాహుల్ వ్యాఖ్యలు
సరిహద్దుల్లో చైనా ఆగడాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైనికులు మోహరించడం.. ఉక్రెయిన్ లో చోటుచేసుకుంటున్న పరిణామాల వంటిదేనని చెప్పారు. అటువంటి ఉద్దేశంతోనే చైనా ఈ చర్యలకు పాల్పడుతోందని అన్నారు.

Rahul Gandhi
Rahul Gandhi: సరిహద్దుల్లో చైనా ఆగడాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైనికులు మోహరించడం.. ఉక్రెయిన్ లో చోటుచేసుకుంటున్న పరిణామాల వంటిదేనని చెప్పారు. అటువంటి ఉద్దేశంతోనే చైనా ఈ చర్యలకు పాల్పడుతోందని అన్నారు.
చైనాతో ముప్పు పొంచి ఉన్న విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లానని, అయితే, దీన్ని ‘హాస్యాస్పద ఐడియా’ అంటూ కొట్టిపారేశారని విమర్శించారు. అమెరికాతో భారత్ కు సత్సంబంధాలు ఉండొద్దని చైనా కోరుకుంటోందని చెప్పారు. అలాగే, అమెరికా, యూరప్ తో ఉక్రెయిన్ సత్సంబంధాలను రష్యా అంగీకరించలేదని, ఒకవేళ ఆయా దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తే ప్రాంతీయ సమగ్రతకు సవాలు విసురుతామని బెదిరించిందని చెప్పారు.
అచ్చం ఇటువంటి పరిస్థితులే ఇప్పుడు చైనా నుంచి భారత్ కు ఎదురవుతున్నాయని అన్నారు. అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని భారత్ ను చైనా హెచ్చరిస్తోందని ఆరోపించారు. అందుకే లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్దకు చైనా సైనికులను పంపిందని వ్యాఖ్యానించారు.
Meghalaya CM Conrad Sangma: మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా