Arunachal Pradesh : ఇద్దరు పౌరులపై పొరపాటున ఆర్మీ కాల్పులు..

ఇది పొరపాటున జరిగిందని ఆర్మీ వెల్లడించింది. కాల్పుల్లో గాయపడిన వారు నోక్ఫియా వాంగ్దాన్, రాంవాంగ్ వాంగ్పులుగా గుర్తించారు. దిబ్రాఘర్ లో ఉన్న అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో

Arunachal Pradesh : ఇద్దరు పౌరులపై పొరపాటున ఆర్మీ కాల్పులు..

Arunachal (1)

Arunachal Pradesh Army : అరుణాచల్ ప్రదేశ్ లో మరోసారి ఆర్మీ జవాన్లు ఇద్దరు సాధారణ పౌరులపై కాల్పులకు తెగబడడం కలకలం రేపింది. చేపల వేటకు వెళుతున్న వీరిపై కాల్పులు జరపడంతో గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరికి ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లోని తిరప్ జిల్లా చాసా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది పొరపాటున జరిగిందని ఆర్మీ వెల్లడించింది. కాల్పుల్లో గాయపడిన వారు నోక్ఫియా వాంగ్దాన్, రాంవాంగ్ వాంగ్పులుగా గుర్తించారు. దిబ్రాఘర్ లో ఉన్న అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

Read More : India-Australia: భారత్ – ఆస్ట్రేలియా మధ్య కీలక ఒప్పందాలు: వాణిజ్య, వృత్తి, విద్యా విసాలు సులభతరం

ఒకరి చేతిలోకి, మరొకరికి కాలిపై బుల్లెట్లు తగిలాయని AMCH సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత దిహింగియా తెలిపారు. ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపారని గ్రామస్తుడు తెలిపారు. వీరిద్దరూ అనాథలు కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఘటనపై తిరప్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కమ్రంగ్ తేసియా స్పందించారు. స్థానికులను భవ్రత కల్పించే బదులు, సరైన నిఘా లేకుండా భద్రతా బలగాలు చేపట్టిన చర్య అవివేకమని అభివర్ణించారు. వారి విశ్వసనీయత కోల్పోయేలా చేస్తోందని మండిపడ్డారు. అరుణాలచల్ ప్రదేశ్ లోని తిరప్, చాంగ్ లాంగ్, లాంగ్ డింగ్ తో సహా మూడు జిల్లాల్లో AFSPA చట్టాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం వివాదాస్పదంగా మారింది. ఈ చట్టం సాయుధ దళాలకు ప్రత్యేక అధికారులు కల్పిస్తుంది. వారెంట్ లేకుండా ఓ వ్యక్తిని అరెస్టు చేయడం, పలు ప్రాంతాల్లో తనిఖీలు చేయడానికి వారికి అధికారం కల్పిస్తుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.