30 Weds 21 : రకరకాల భార్యలు..ఆర్జీవీ వెబ్ సిరీస్, ఒక్కో ఎపిసోడ్‌‌లో ఒక్కో రకం భార్య

‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వర్మ వెల్లడించారు. ఈ మేరకు 2021, జూలై 25వ తేదీ ఆదివారం యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న భార్యల గురించి అందరికీ తెలియచేస్తూ...ఏ సిరీస్ కొనసాగనుందని ఆయన తెలిపారు.

30 Weds 21 : రకరకాల భార్యలు..ఆర్జీవీ వెబ్ సిరీస్, ఒక్కో ఎపిసోడ్‌‌లో ఒక్కో రకం భార్య

Rgv

Web Series RGV : ప్రముఖ దర్శకుడు మరో వెబ్ సిరీస్‌‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. వివాదాస్పదాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా నిలిచే వర్మ..మరో అంశాన్ని ఎంచుకున్నారు. ‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వర్మ వెల్లడించారు. ఈ మేరకు 2021, జూలై 25వ తేదీ ఆదివారం యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న భార్యల గురించి అందరికీ తెలియచేస్తూ…ఏ సిరీస్ కొనసాగనుందని ఆయన తెలిపారు. సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోరకం భార్యను చూపించనున్నట్లు ఆయన తెలిపారు.

Read More : Mamata Banerjee: మమత చూపు హస్తినవైపు.. మోదీతో దీదీ మీటింగ్!

విభిన్నమైన కాన్సెప్ట్ లు, వివాదాస్పద అంశాలను సృశిస్తూ..తెరకెక్కించే వర్మ..భిన్నమైన అంశంతో ముందుకు వచ్చారు. భార్యలు..వాళ్లలో రకాలు అనే అంశాన్ని చూపిస్తూ..సిరీస్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సిరీస్ లో ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎంతో మంది మహాకవులు స్త్రీ స్వరూపాన్ని వివిధ రకాలుగా అభివర్ణించారని, కానీ కాలమానంలో ఎన్నో రకాల స్త్రీలు ఉద్భవిస్తారనే విషయాన్ని వాళ్లు గ్రహించలేకపోయారని తెలిపారు. కేశవదాసు, జయదేవుడు, వనమాలి శతాబ్దాల క్రితం నాటి మహానుభావులు..స్త్రీల వర్గీకరణను సుదీర్ఘంగా విపులకరించారని వీడియోలో తెలిపారు.

Read More : Yellow Tongue : కెనాడా బాలుడికి వింత వ్యాధి…పసుపు రంగులోకి మారిన నాలుక

భార్యలుగా మారినప్పుడే స్త్రీల విశ్వరూపం బయటకు వస్తుందని, స్వాధీనపత్రుక అంటే భర్తను స్వాధీనంలో ఉంచుకుని గుప్పిట్లో పెటుకొనే రకం, కలహాంతరింత అంటే ఎప్పుడూ దెబ్బలాడడం..ఉంటారన్నారు. మహానుభావులు ఊహించనది…కాలంలో ఎన్నోరకాల స్త్రీలు ఉన్నారని, 2021లో కింది రకాల భార్యలు ఉంటారనేది పెళ్లిళ్లు చేసుకున్న భర్తలకు మాత్రమే తెలుసన్నారు. అందరికీ తెలువాలనే సదుద్దేశ్యంతో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక మగవాడికి ఎలాంటి భార్య దొరికితే..అతని బతుకు ఎలా తయారవుతుందోని చూపెట్టడమే తన ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

Read More : Wind Energy : ఇదొక్కటి ఉంటే చాలు.. 80వేల ఇళ్లకు కరెంట్!

రకరకాల భార్యలు ఎవరంటే..1. ఎడుపు గొట్టు. 2.ఎప్పుడూ దెబ్బలాడుతూనే ఉంటుంది. 3. ఫోన్ పట్టుకుంటే వదలదు. 4. అనుమానపు పిశాచి. 5. ముక్కు మీద కోపం. 6. మొగుడిని తొక్కుతు ఉంచుతుంది. 7.పిసినిగొట్టు. 8. గొప్పలు చెప్పుకునే ఉంటుంది. ఇదంతా సీజన్ 1. సీజన్ 2లో త్వరలో వస్తుందన్నారు వర్మ. దీని పేరు ‘రకరకాల భర్తలు’ అంటూ చెప్పారు. మరి ఈ సిరీస్ పై ఎలాంటి స్పందన వ్యక్తమౌతాయో చూడాలి.