MMTS Trains Cancel : రేపు 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
ప్రస్తుతం 79 సర్వీసులకు గానూ 36 సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతుండడంతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొంది.

Mmts 11zon
36 MMTS trains canceled tomorrow : హైదరాబాద్ లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను సోమవారం రద్దు చేశారు. నగరంలో పలు రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న మార్గాల్లో 36 రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం 79 సర్వీసులకు గానూ 36 సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతుండడంతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొంది.
లింగంపల్లి-హైదరాబాద్ మీదుగా నడిచే 9 రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి మీదుగా నడిచే 9 సర్వీసులు, ఫలక్ నుమా-లింగంపల్లి మీదుగా 8 సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది.
Pocharam Srininivas Corona : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రెండోసారి కరోనా
అలాగే లింగంపల్లి-ఫలక్ నుమా మీదుగా నడిచే 8 రైలు సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ మీదుగా నడిచే రెండు రైల్వే సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది.