bihar: బిహార్‌లో ఎంఐఎంకు షాక్‌.. ఆర్డేడీలో చేరనున్న న‌లుగురు ఎమ్మెల్యేలు?

హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీకి బిహార్ అసెంబ్లీలో ఐదు సీట్లు ఉన్నాయి. అయితే, ఆ ఐదుగురిలో న‌లుగురు ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (ఆర్జేడీ)లో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది.

bihar: బిహార్‌లో ఎంఐఎంకు షాక్‌.. ఆర్డేడీలో చేరనున్న న‌లుగురు ఎమ్మెల్యేలు?

Aimim 11zon

bihar: హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీకి బిహార్ అసెంబ్లీలో ఐదు సీట్లు ఉన్నాయి. అయితే, ఆ ఐదుగురిలో న‌లుగురు ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (ఆర్జేడీ)లో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే ఆర్జేడీ నేత తేజస్వీ యాద‌వ్‌తో సంప్ర‌దింపులు జ‌రిపార‌ని స‌మాచారం. ఆ న‌లుగురు అనుకున్న‌ట్లుగానే ఆర్జేడీలో చేరితో బిహార్‌లో ఏఐఎంఐఎంకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలే ప్ర‌మాదం ఉంది.

Jammu Kashmir: ఏదైనా చేసి ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దండి: ఒమ‌ర్ అబ్దుల్లా

గ‌త ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఏఐఎంఐఎం ఒక్క సీటూ గెలుచుకోలేక‌పోయిన విష‌యం తెలిసిందే. దీంతో బిహార్‌లోనూ భ‌విష్య‌త్తులో త‌మ‌ పార్టీ ప‌రిస్థితి అంతేనంటూ ఆ రాష్ట్ర ఏఐఎంఐఎం నేత‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముస్లింల ప్రాబ‌ల్యం అధికంగా ఉన్న నియోజ‌క వ‌ర్గాల్లో ఏఐఎంఐఎం పోటీ చేసి స‌త్తా చాటింది. బిహార్‌లో త‌దుపరి అసెంబ్లీ ఎన్నిక‌ల్లు మ‌ళ్లీ 2025లో జ‌ర‌గాల్సి ఉంది. బీజేపీ-జేడీయూ కూట‌మికి ఆర్జేడీ గ‌ట్టి పోటీనిచ్చే అవ‌కాశం ఉంది.

Prophet remarks row: మాట్లాడేముందు పార్టీ నేత‌లు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి: బీజేపీ

ఆర్జేడీకి బిహార్‌లో ఇప్ప‌టికే 76 సీట్లు ఉన్నాయి. ఆ పార్టీలో ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు చేరితే ఆర్జేడీ మ‌రింత బ‌ల‌ప‌డ‌త‌నుంది. ఏఐఎంఐఎం నేత‌ల‌ను ఆ పార్టీ అదిష్ఠానం బుజ్జ‌గించే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు బిహార్‌లోని త‌మ పార్టీ నేత‌లు ఆర్జేడీలో చేర‌నున్నార‌ని వ‌స్తున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని ఎంఐఎం నాయకుడు అక్తరుల్‌ ఇమామ్ అంటున్నారు. అస‌లు గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ ఏఐఎంఐఎం ఎమ్మెల్యేల‌ను ఆర్జేడీలో చేర్చుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. అయితే, త‌మ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకూ లొంగ‌బోర‌ని ఆయ‌న అంటున్నారు.