Jammu Kashmir: ఏదైనా చేసి ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దండి: ఒమ‌ర్ అబ్దుల్లా

Jammu Kashmir: ఏదైనా చేసి ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దండి: ఒమ‌ర్ అబ్దుల్లా

Omar Abdullah

Jammu Kashmir: జ‌మ్మూక‌శ్మీర్‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా ఆందోళ‌న వ్యక్తం చేశారు. ఏదైనా చేసి జ‌మ్మూక‌శ్మీర్‌లోని ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దాల‌ని ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, జ‌మ్మూక‌శ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లను నిర్వ‌హించే అంశంపై ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

Prophet remarks row: మాట్లాడేముందు పార్టీ నేత‌లు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి: బీజేపీ

”క‌శ్మీర్‌లోని ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో ప్ర‌తి ఒక్క‌రికి తెలుసు. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌ని రోజే లేదు. ప్ర‌జ‌లు దుఃఖంలో ఉన్నారు. ఈ ప‌రిస్థితులు తొల‌గిపోవాలి. అందుకు ప్ర‌భుత్వం ఏదైనా చేయాలి” అని ఒమ‌ర్ అబ్దుల్లా మీడియాతో అన్నారు. కాగా, జ‌మ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల అంశంపై కూడా ఆయ‌న స్పందించారు. ఎన్నిక‌లు నిర్వ‌హించే విష‌యంపై ఎన్నిక సంఘం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని చెప్పారు. ఆ బాధ్యత‌ ఎన్నిక‌ల సంఘానిదేన‌ని అన్నారు.

Prophet Comments Row: ఢిల్లీ, ముంబైతో సహా పలు చోట్ల దాడులు జరుపుతామంటోన్న ఆల్-ఖైదా

అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నిక‌ల కోసం ఎలాంటి చ‌ర్య‌లూ ప్రారంభించ‌లేద‌ని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కాగా, జ‌మ్మూక‌శ్మీర్‌లో వ‌రుస‌గా చోటు చేసుకుంటోన్న‌ ఉగ్ర‌దాడులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ముఖ్యంగా క‌శ్మీర్ పండిట్ల‌ను ఉగ్ర‌వాదులు ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. దీంతో క‌శ్మీర్ పండిట్లు మ‌ళ్లీ వ‌ల‌స వెళ్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.