Republic Day : 73వ గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధం

ప్రధాని మోదీ జాతీయ యుద్ధస్మారకం వద్దకు వెళ్లి దేశం తరపున అమర వీరులకు నివాళులు అర్పించిన తర్వాత గణతంత్ర పరేడ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

Republic Day : 73వ గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధం

Republic Day

Updated On : January 26, 2022 / 7:40 AM IST

Republic Day Celebrations : 73వ గణతంత్ర దినోత్సవానికి భారతావని సిద్ధమైంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ ఏడాది వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మరికొద్దిగంటల్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్​తో గణతంత్ర వేడుకలు ప్రారంభంకానున్నాయి. గణతంత్ర పరేడ్ ఎప్పటిలా ఉదయం 10 గంటలకు కాకుండా ఈసారి అరగంట ఆలస్యంగా పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు.

ప్రధాని మోదీ జాతీయ యుద్ధస్మారకం వద్దకు వెళ్లి దేశం తరపున అమర వీరులకు నివాళులు అర్పించిన తర్వాత గణతంత్ర పరేడ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం పరేడ్‌ను వీక్షించేందుకు ప్రధాని, ఇతర ప్రముఖులు రాజ్​పథ్​చేరుకుంటారు. సంప్రదాయం ప్రకారం… రాజ్‌పథ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం… 21 గన్ సెల్యూట్‌తో జాతీయ గీతం ఆలపిస్తారు.

AP PRC : తగ్గేదేలే.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు, పెన్షన్లు.. జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్రపతి సెల్యూట్ చేసిన తర్వాత పరేడ్​ ప్రారంభమవుతుంది. పరేడ్‌లో భాగంగా త్రివిధ దళాలు మార్చ్​ నిర్వహిస్తాయి. సైనికులు 1947 నుంచి ఇప్పటివరకు ధరించిన వివిధరకాల యూనిఫాంలతో పాటు ఆయుధాలను ప్రదర్శిస్తారు. అనంతరం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 9 మంత్రిత్వ శాఖలకు సంబంధించి 21 శకటాల ప్రదర్శన ఉంటుంది.

గ‌ణ‌తంత్ర దినోత్సవాల్లో ఈసారి యుద్ధ విమానాలు అంద‌ర్నీ ఆక‌ర్షించ‌నున్నాయి. 75 విమానాల‌తో ఫ్లై పాస్ట్ చేయాల‌ని ర‌క్షణ శాఖ నిర్ణయించింది. ఈ 75 యుద్ధ విమానాల్లో పాత విమానాలు, కొత్త విమానాలు కూడా ఉండనున్నాయి. సుఖోయ్‌, రాఫెల్‌, జాగ్వర్‌, ఎంఐ-17, సారంగ్‌, అపాచీ, డ‌కోటాతో పాటు రాహ‌త్‌, మేఘ‌న‌, ఏక‌లవ్య, త్రిశూల్‌, తిరంగా, విజ‌య్‌, అమృత్ లాంటి వాటిని కూడా ప్రదర్శించననున్నారు.

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

వీటిని వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ర‌క్షణ రంగంలోని వివిధ కీల‌క ఘ‌ట్టాలు, షార్ట్ ఫిల్మ్‌లు, సాయుధ ద‌ళాల‌కు సంబంధించిన వీడియోల‌ను కూడా ప్రదర్శించనుంది రక్షణ శాఖ. రిపబ్లిక్‌ డే పరేడ్‌ను వీక్షించేందుకు ఇప్పటికే సందర్శకులు రాజ్‌పథ్‌ చేరుకున్నారు. ఈ వేడుకల్లో తొలిసారి 480 కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శన ఏర్పాటు చేశారు.