Padma Awards 2022 : పద్మ అవార్డుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరికంటే..?

రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది.

Padma Awards 2022 : పద్మ అవార్డుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరికంటే..?

Padma Awards 2022 Padma Awa

Padma Awards 2022 : రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా.. వారిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, మరో 107 మందికి పదశ్మీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో కేంద్రం ఈ 2022 పద్మ అవార్డులను ప్రకటించింది.

దివంగత జనరల్‌ బిపిన్‌రావత్‌ సహా యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌, యూపీకి చెందిన సాహిత్యవేత్త రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం), ప్రభా ఆత్రే (మహారాష్ట్ర) పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. విక్టర్ బెనర్జీకి పద్మభూషణ్ పురస్కారం, గుర్మీత్ బవా (మరణానంతరం) పద్మభూషణ్ పురస్కారం, నటరాజన్ చంద్ర శేఖరన్‌కి పద్మభూషణ్ పురస్కారం, పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య, కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్‌ అవార్డులను కేంద్రం ప్రకటించింది.


తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి..
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 6గురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఏపీ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు పద్మశ్రీ అవార్డు దక్కగా, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్‌హసన్‌ పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామ చంద్రయ్యలను పద్మశ్రీలు వరించాయి.

భారత్‌ బయోటెక్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా (తెలంగాణ)కు సంయుక్తంగా పద్మభూషణ్ ప్రకటించింది. సీరమ్‌ సంస్థ సైరస్‌ పూనావాలాకు, టెక్‌ దిగ్గజాలైన సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల, పద్మభూషణ్‌ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

Read Also : RRR రెండు రిలీజ్ డేట్స్.. చిన్న సినిమాలకు బెంగ!