Karnataka Polls: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో పత్తా లేని ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ హోదా వచ్చిన మొదటి ఎన్నికల్లోనే దారుణ ఓటమి

కొద్ది రోజుల క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా దక్కింది. జాతీయ హోదా వచ్చిన అనంతరం ఆప్‭కు ఇవే తొలి ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కనుచూప మేరలోనైనా కనపించకపోవడం గమనార్హం. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‭కు ఇది గట్టి ఎదురుదెబ్బ అని విమర్శకులు అంటున్నారు

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో పత్తా లేని ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ హోదా వచ్చిన మొదటి ఎన్నికల్లోనే దారుణ ఓటమి

AAP: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బాగా హడావిడి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇది ఎన్నికల ఫలితాల్లో కూడా కనిపించింది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవిని ఎరుగని విజయం సాధించిన చీపురు పార్టీ.. అనంతరం జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎవరూ ఊహించని విధంగా 12.9 శాతం ఓట్లు సాధించడమే కాకుండా.. 5 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

By-Election: ఉప ఎన్నికల్లో కూడా కనిపించని బీజేపీ.. ఆప్, బీజేడీ, ఎస్పీ హవా

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు నెలలకే జరిగిన కర్ణాటక ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ బొక్కా బోర్లా పడింది. 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో ఆప్ 209 మంది అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. కానీ, ఫలితాల్లో మాత్రం 0.5 శాతం ఓట్ల వద్దే చతికిల పడిపోయింది. సరిగ్గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక ఆప్ ఉపాధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు, భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇది ఆ పార్టీకి ఒక ఎదురుదెబ్బలా మిగిలిపోయింది. దీనికి తోడు రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల పోటాపోటీ మధ్య ఆప్ నిలబడలేకపోయింది.

Karnataka Polls: సౌత్ ఇండియా నుంచి బీజేపీ ఔట్..! ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట హవా

ఇవన్నీ పక్కన పెడితే కొద్ది రోజుల క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా దక్కింది. జాతీయ హోదా వచ్చిన అనంతరం ఆప్‭కు ఇవే తొలి ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కనుచూప మేరలోనైనా కనపించకపోవడం గమనార్హం. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‭కు ఇది గట్టి ఎదురుదెబ్బ అని విమర్శకులు అంటున్నారు.