Abhinav Gomatam : హీరోగా మారుతున్న మరో కమెడియన్

తాజాగా మరో కమెడియన్ కూడా హీరోగా మారబోతున్నాడు. ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, మళ్ళీ రావా, ఇచ్చట వాహనములు నిలపరాదు... లాంటి సినిమాలతో కమెడియన్ గా, మంచి నటుడిగా......

Abhinav Gomatam : హీరోగా మారుతున్న మరో కమెడియన్

Abhinav Gomatam

 

Abhinav Gomatam :  ఒకప్పుడు ఏ పాత్రలు చేసే వాళ్ళు అవే పాత్రలు చేసే వాళ్ళు. కానీ తర్వాత ప్రతి ఆర్టిస్ట్ అన్ని రకాల పాత్రల్ని చేస్తున్నారు. ముఖ్యంగా కమెడియన్స్ గతంలో కేవలం కామెడీ మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు కామెడీతో పాటు అన్ని రకాల పాత్రల్ని చేసి మెప్పిస్తున్నారు. ఇక గత కొద్దికాలంగా చాలా మంది కమెడియన్లు హీరోలుగా మారుతున్నారు. గతంలో ఆలీ, సునీల్ తర్వాత శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, సుధీర్, ప్రియదర్శి… ఇలా చాలా మంది కమెడియన్స్ హీరోలుగా మారుతున్నారు. తాజాగా మరో కమెడియన్ కూడా హీరోగా మారబోతున్నాడు.

Bangarraju : సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’.. వాసివాడి తస్సాదియ్యా ‘బంగార్రాజు’ టీజర్ అదిరిందిగా

ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, మళ్ళీ రావా, ఇచ్చట వాహనములు నిలపరాదు… లాంటి సినిమాలతో కమెడియన్ గా, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠం ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో కూడా అలరించాడు. ఇప్పుడు అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇవాళ న్యూ ఇయర్ తో పాటు అభినవ్ పుట్టిన రోజు కావడంతో విషెస్ చెప్తూ ఈ ప్రాజెక్టు ని అనౌన్స్ చేశారు.

Nani : నాని ఖాళీగా ఉంటే ఎక్కువగా ఎక్కడ ఉంటాడో తెలుసా?

కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఓ కొత్త దర్శకుడి డైరెక్షన్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేసిన చిత్ర బృందం త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.