SRH vs LSG: అభిషేక్ శ‌ర్మ.. ఎంత ప‌ని జేస్తివి.. నీ దెబ్బ‌కు హైద‌రాబాద్‌ ఓడిపాయె..!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్‌(Sunrisers Hyderabad)కు మ‌రో ఓట‌మి ఎదురైంది. 16వ‌ ఓవ‌ర్ మ్యాచ్ గ‌తిని మొత్తం మార్చేసింది. ఈ ఓవ‌ర్‌లో ఏకంగా 31 ప‌రుగులు వ‌చ్చాయి.

SRH vs LSG: అభిషేక్ శ‌ర్మ.. ఎంత ప‌ని జేస్తివి.. నీ దెబ్బ‌కు హైద‌రాబాద్‌ ఓడిపాయె..!

Abhishek Sharma (Photo: @SRH))

Abhishek Sharma: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్‌(Sunrisers Hyderabad)కు మ‌రో ఓట‌మి ఎదురైంది. శ‌నివారం ఉప్ప‌ల్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌( Lucknow Super Giants)తో జ‌రిగిన మ్యాచ్‌లో పేల‌వ బౌలింగ్‌తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ప్ర‌త్య‌ర్థి ముందు మంచి ల‌క్ష్యాన్ని నిర్దేశించిన స‌న్‌రైజ‌ర్స్ అందుకు త‌గ్గట్లుగానే మొద‌ల్లో బాగా బౌలింగ్ చేసింది. దీంతో ఓ ద‌శ‌లో స‌న్‌రైజ‌ర్స్ సునాయాసంగా గెలిచేలా క‌నిపించింది. అయితే.. ఒక్క ఓవ‌ర్‌ స‌న్‌రైజ‌ర్స్ కొంప‌ముంచింది. లక్నో గెలుపు స‌మీక‌ర‌ణాన్ని ఈజీ చేసింది.

31 ప‌రుగులు, ఓ వికెట్‌

ల‌క్ష్య ఛేద‌న‌లో 15 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోరు 114/2. ల‌క్నో విజ‌యానికి 30 బంతుల్లో 69 ప‌రుగులు కావాలి. క్రీజులో మార్క‌స్ స్టోయిన్ 28, ప్రేరక్ మన్కడ్ 50 ప‌రుగుల‌తో ఆడుతున్నారు. ఈ ద‌శలో స‌న్‌రైజ‌ర్స్ గెలిచేందుకు మంచి అవ‌కాశాలు ఉన్నాయి. అప్ప‌టికి అభిషేక్ శ‌ర్మ రెండు ఓవ‌ర్లు వేసి 11 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. దీంతో అత‌డిపై న‌మ్మ‌కంతో స‌న్ రైజ‌ర్స్‌ కెప్టెన్ మార్‌క్ర‌మ్ అత‌డి చేతికి మ‌రోసారి బంతిని అందించాడు.

IPL 2023:ఉప్ప‌ల్‌లో మ‌రో ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ పై ల‌క్నో విజ‌యం.. హైద‌రాబాద్ ప్లే ఆఫ్స్ ఆశ‌లు గ‌ల్లంతు..!

ఈ(16వ‌) ఓవ‌ర్ మ్యాచ్ గ‌తిని మొత్తం మార్చేసింది. మొద‌టి రెండు బంతుల‌కు స్టోయినిస్ సిక్స్‌లు కొట్ట‌గా మూడో బంతికి అత‌డు ఔట్ అయ్యాడు. అయితే.. క్రీజులో వ‌చ్చిన పూర‌న్ మిగిలిన మూడు బంతుల‌కు సిక్స్‌లు బాదాడు. ఓ వైడ్ కూడా వేయ‌డంతో ఈ ఓవ‌ర్‌లో ఏకంగా 31 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో ల‌క్నో విజ‌య‌స‌మీక‌ర‌ణం 24 బంతుల్లో 38గా మారింది. ల‌క్నోపై ఒత్తిడి తొల‌గిపోయింది. త‌న ధాటిని కొన‌సాగించిన పూర‌న్ మ‌రో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజ‌యాన్ని అందించాడు.

ఈ ఓవ‌ర్‌లో క‌నుక అభిషేక్ శ‌ర్మ కాస్త మంచిగా వేసి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని అంటున్నారు స‌న్‌రైజ‌ర్స్ అభిమానులు. ఏదీ ఏమైన ఈ ఓట‌మితో స‌న్‌రైజ‌ర్స్ ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. టెక్నిక‌ల్‌గా మాత్ర‌మే స‌న్‌రైజ‌ర్స్‌ రేసులో ఉంది. మిగిలిన‌ మూడు మ్యాచుల్లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ గెల‌వ‌డంతో పాటు ఇత‌ర జ‌ట్ల స‌మీక‌ర‌ణాలు క‌లిసివ‌స్తేనే ఫ్లే ఆఫ్స్‌కు వెలుతుంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో స‌న్‌రైజ‌ర్స్ ఈ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు చేర‌డం అసంభ‌వంగానే క‌నిపిస్తోంది.

IPL 2023: ఉప్ప‌ల్‌లో గౌత‌మ్ గంభీర్‌ను టార్గెట్ చేసిన అభిమానులు.. కోహ్లి కోహ్లి అంటూ..

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హెన్రిచ్ క్లాసెన్(47; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అబ్దుల్ స‌మ‌ద్‌(37నాటౌట్‌; 25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు) లు రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. ప్రేరక్ మన్కడ్ (64నాటౌట్‌; 45 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా మార్క‌స్ స్టోయినిస్‌( 40; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), నికోల‌స్ పూర‌న్‌( 44నాటౌట్‌; 13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)లు దంచికొట్ట‌డంతో మ‌రో నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్నో ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో ల‌క్నో ప్లే ఆఫ్స్ ఆశ‌లు మ‌రింత మెరుగు అయ్యాయి.