Acharya: ఆచార్య ఆగయా.. ఓన్లీ తెలుగులోనే వర్కౌట్ అవుతుందా?

అందరి కళ్లూ ఆచార్య మీదే. మెగా తండ్రీకొడుకులు.. స్టార్ డైరెక్టర్ కొరటాలతో కలిసి చేసిన ఆచార్య వచ్చేసింది. ప్రజెంట్ పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ ప్రతి సినిమా జపం చేస్తున్నా.. ఈ మెగా మూవీ మాత్రం స్ట్రెయిట్ తెలుగు ఆడియన్స్ నే టార్గెట్ చేసుకుని వచ్చింది.

Acharya: ఆచార్య ఆగయా.. ఓన్లీ తెలుగులోనే వర్కౌట్ అవుతుందా?

Acharya

Acharya: అందరి కళ్లూ ఆచార్య మీదే. మెగా తండ్రీకొడుకులు.. స్టార్ డైరెక్టర్ కొరటాలతో కలిసి చేసిన ఆచార్య వచ్చేసింది. ప్రజెంట్ పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ ప్రతి సినిమా జపం చేస్తున్నా.. ఈ మెగా మూవీ మాత్రం స్ట్రెయిట్ తెలుగు ఆడియన్స్ నే టార్గెట్ చేసుకుని వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆచార్య ఓన్లీ తెలుగు రిలీజ్ కాస్త ఇబ్బందైనా.. వాటన్నింటినీ ఓవర్ కమ్ చేసే ఎలిమెంట్స్ తో పవర్ ప్యాక్డ్ గా వచ్చింది ఆచార్య సినిమా.

Acharya: ఆచార్య ప్రీమియర్ షో టాక్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య.. తెలుగులో బిగ్ సెన్సేషన్. తండ్రీకొడుకులు ఒకే సినిమాలో ఫుల్ లెంత్ రోల్స్ లో కలిసొస్తే ఫ్యాన్స్ కు పండగే. అదీ ఒక్క ఫ్లాప్ కూడా లేని కొరటాల శివ డైరెక్షన్ లో మెగా హీరోలు రాబోతుంటే.. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పుడు ఈ వెయిటింగ్ కి తెరపడింది. ఏప్రిల్ 29న తెలుగు లాంగ్వేజ్ లోనే ఆచార్య దాదాపు 15 వందలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయింది.

Acharya: హీరోయిన్ లేని మెగాస్టార్ సినిమా.. కెరీర్‌లోనే ఇదే ఫస్ట్ టైమ్!

దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆచార్యలో లీడ్ రోల్ చిరంజీవిదే. కానీ రామ్ చరణ్ 40 నిమిషాలు స్క్రీన్ మీద సందడి చేశాడు. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. చరణ్ కి పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్నా.. సినిమాని మాత్రం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు టీమ్.

Acharya : ఇండియాలోనే ఫస్ట్ బిగ్గెస్ట్ సెట్.. ధర్మస్థలిపై మెగాస్టార్ మాటల్లో..

ఇంత బడ్జెట్ తో ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చెయ్యడం అంటే రిస్కే. గ్రాండ్ ఓపెనింగ్స్ తో పాటు మంచి టాక్ సంపాదించుకుంటే.. కలెక్షన్లు కొల్లగొట్టడం పెద్ద కష్టం కాకపోయినా.. ఆ రేంజ్ హైప్ తో కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది ఆచార్య. ట్రైలర్స్, టీజర్స్ లోనే హై వోల్టెజ్ సీన్స్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఆచార్యను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. అంతేకాదు.. పోటాపోటీ స్టెప్పులతో నువ్వా నేనా అనిపించారు చిరూ-చరణ్.

Acharya: ‘ఆచార్య’లో ఆ సీన్ ఇష్టమంటోన్న చరణ్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!

రిలీజ్ కి ముందే తగ్గను గాక తగ్గననుకుంటున్న ఈ తండ్రీకొడుకులు పవర్ఫుల్ మూమెంట్స్ తో ఫ్యాన్య్ కి కావాల్సినంత ట్రీట్ ఇచ్చారు. అందుకే మెగాఫ్యాన్స్ ఎప్పెడెప్పుడా అని ఈ మూవీ కోసం ఎదురుచూశారు. కొరటాల మేకింగ్ స్టైల్ లో మెగా హీరోల యాక్షన్ స్టైల్ అదిరిపోతుందనే అంచనాలు పెంచేసుకున్నారు. ఈ ఇద్దరు హీరోల అగ్రెషన్ తో హీటెక్కిపోయిన ఫాన్స్ కి పూజాహెగ్డే.. తనక్యూట్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. అటు మెగాస్టార్, ఇటు మెగా పవర్ స్టార్ ఇద్దరితో స్క్రీన్ షేర్ చేసుకునే జాక్ పాట్ కొట్టడమే కాకుండా సినిమాకి వన్ ఆఫ్ ద ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ గా మారింది పూజా. అయితే.. ఫస్ట్ డే ఆల్ షోస్ పడితే కానీ సినిమా రిజల్ట్ ఏంటన్నది తేల్చలేని పరిస్థితి.