Sonu Sood : కోవిడ్‌తో బాధపడుతున్న యువతిని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించిన సోనూ సూద్!..

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కష్టపడుతున్నవారికి సోనూ సూద్ అవిశ్రాంతంగా మరియు నిస్వార్థంగా పేదవారి కోసం పనిచేస్తున్నారు. తాజాగా సోనూ సూద్, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపించారు..

Sonu Sood : కోవిడ్‌తో బాధపడుతున్న యువతిని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించిన సోనూ సూద్!..

Actor Sonu Sood Arranges Air Ambulance For Covid Patient Bharti

Sonu Sood: కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కష్టపడుతున్నవారికి సోనూ సూద్ అవిశ్రాంతంగా మరియు నిస్వార్థంగా పేదవారి కోసం పనిచేస్తున్నారు. తాజాగా సోనూ సూద్, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపించారు.

కోవిడ్ -19 కారణంగా భారతి అనే అమ్మాయి దాదాపు 85-90% ఊపిరితిత్తులను కోల్పోయింది. సోను ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఇది హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోను అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపారు.

Sonu Sood

ECMO అని పిలువబడే ఒక ప్రత్యేక చికిత్స ఉందని అతను తెలుసుకున్నారు. దీనిలో శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తగ్గించవచ్చు. ఈ ECMO చికిత్స కోసం మొత్తం సెటప్ హైదరాబాద్ నుండి 6 మంది వైద్యులతో ఒక రోజు ముందుగానే రావాలి. ఇందుకోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో భారతి ఉత్తమమైన చికిత్సను పొందగలిగారు.

దీని గురించి సోను సూద్ మాట్లాడుతూ.. “అవకాశాలు 20% మాత్రమే అని వైద్యులు తెలిపారు. ఆమె 25 ఏళ్ల యువతి, అందుకే మేము ఈ అవకాశాన్ని తీసుకున్నాము, వెంటనే ఎయిర్ అబులెన్సు బుక్ చేశాము. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స బాగా జరుగుతోంది, ఆమె కోలుకొని త్వరలో తిరిగి వస్తుంది”.. అన్నారు.

Bharti

కోవిడ్ -19 పాండమిక్‌లో ఒకరిని విమానంలో చికిత్సకు తీసుకురావడం ఇదే మొట్టమొదటి సారి.. భారతి తండ్రి రిటైర్డ్ రైల్వే అధికారి. కాగా సోనూ సూద్‌కు కరోనా పాజిటివ్ అని ఇటీవల తేలింది. హోమ్ quarantine లో ఉంటూ ఇవన్నీ చేయడం అభినందనీయం. అందుకే ఆయన ‘రియల్ హీరో’..