Actress Geetanjali : డేటింగ్ యాప్‌లో ఫొటోలు, సినీ నటి గీతాంజలికి వేధింపులు

సినీ నటి గీతాంజలికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొంతమంది పోకిరీలు తన ఫొటోలను డేటింగ్ యాప్ లో పెట్టారని ఆన్ లైన్ లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది గీతాంజలి. డేటింగ్

Actress Geetanjali : డేటింగ్ యాప్‌లో ఫొటోలు, సినీ నటి గీతాంజలికి వేధింపులు

Actress Geetanjali

Updated On : May 26, 2021 / 11:07 AM IST

Actress Geetanjali Lodges Complaint : సినీ నటి గీతాంజలికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొంతమంది పోకిరీలు తన ఫొటోలను డేటింగ్ యాప్ లో పెట్టారని ఆన్ లైన్ లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది గీతాంజలి. డేటింగ్ యాప్ లో తన ఫొటోలు పెట్టడంతో తనకు వేధింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదులో తెలిపారు.

గీతాంజలి ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. డేటింగ్ యాప్ లో ఫొటోల వెనుక ఉన్నది ఆమెకు తెలిసిన వారేనా? లేక పోకిరీలా? అన్నది గుర్తించే పనిలో పడ్డారు.