Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు

ఎత్తైన మంచు పర్వతాలపైనా పహారా కాస్తున్న సైనికులు శత్రుమూకలను ఏమార్చేందుకు తమ శరీరాలను మంచు బొరియలలో కప్పేసుకుంటారు.

Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు

Soldiers

Indian Soldiers: ఏ స్వార్ధం ఆశించకుండా దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేవాడు సైనికుడు. సరిహద్దుల వద్ద ఎటువంటి కఠిన పరిస్థితులు ఉన్నా..తట్టుకుంటూ..దేశ భద్రత కోసం పాటుపడతారు సైనికులు. కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ దేశ రక్షణ కోసం సైనికులు ఎంతలా కష్టపడుతున్నారో తెలిపే ఘటన ఇది. ఎత్తైన మంచు పర్వతాలపైనా పహారా కాస్తున్న సైనికులు శత్రుమూకలను ఏమార్చేందుకు తమ శరీరాలను మంచు బొరియలలో కప్పేసుకుంటారు. గడ్డ కట్టే చలిలో, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఎత్తైన పర్వతాల మధ్య మాములుగా సంచరించడానికే వీలు కాదు. అటువంటి అత్యంత శీతల ప్రాంతంలో భారత సైనికులు..మంచులో కూరుకుపోయి ఇలా దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్నారు.

దేశ రక్షణలో సైనికుడి ధృడసంకల్పం ఎటువంటిదో ఈ చిత్రం తెలుపుతుందంటూ ఇండియన్ ఆర్మీలోని అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ విభాగం ఈ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. సైనికులు తుపాకులు చేతబట్టుకుని, తమ శరీరంలోని సగం పైగా భాగాన్ని మంచులో కప్పేసుకున్న ఆ చిత్రం చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. భారత సైనికుల ధీరత్వాన్ని ప్రశంసిస్తున్నారు. ఉత్తర కాశ్మీర్ లో చొరబాటు దారులను అడ్డుకునేందుకు ఇక్కడ నిరంతర గస్తీ ఉంటుంది. ఈక్రమంలోనే సైనికులు ఇలా అతిశీతల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుంటూ పహారా కాస్తుంటారు.

other stories:Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్