Adipurush : ఇప్ప‌టికి జ్ఞానోద‌య‌మైందా..! త‌ప్పుఒప్పుకున్న ఆదిపురుష్ డైలాగ్ రైట‌ర్‌.. చేతులెత్తి మొక్కుతున్నా.. క్ష‌మించండి

ప్ర‌భాస్ (Prabhas) రాముడిగా, కృతి స‌న‌న్ (Kriti Sanon)సీత‌గా న‌టించిన చిత్రం ఆది పురుష్‌(Adipurush). ఈ చిత్రానికి మాట‌లు రాసిన‌ ర‌చ‌యిత మ‌నోజ్ ముంతాషిర్ బేషరతుగా క్షమాపణలు కోరారు. తాను త‌ప్పు చేసిన‌ట్లు అంగీక‌రించారు.

Adipurush : ఇప్ప‌టికి జ్ఞానోద‌య‌మైందా..! త‌ప్పుఒప్పుకున్న ఆదిపురుష్ డైలాగ్ రైట‌ర్‌.. చేతులెత్తి మొక్కుతున్నా.. క్ష‌మించండి

Adipurush writer Manoj Muntashir

Updated On : July 8, 2023 / 3:01 PM IST

Adipurush writer Manoj Muntashir : ప్ర‌భాస్ (Prabhas) రాముడిగా, కృతి స‌న‌న్ (Kriti Sanon)సీత‌గా న‌టించిన చిత్రం ఆది పురుష్‌(Adipurush). రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించగా..రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య జూన్ 16న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే.. విడుద‌లైన నాటి నుంచి ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి.

రామాయ‌ణాన్ని వ‌క్రీక‌రించార‌ని, ఆధ్యాత్మిక అంశాలు కొర‌వ‌డ్డాయ‌ని, సంభాషణలు బాగాలేవ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా ఈ చిత్రానికి మాట‌లు రాసిన‌ ర‌చ‌యిత మ‌నోజ్ ముంతాషిర్ (Manoj Muntashir)పై మండిప‌డ్డారు. దీనిపై ఇన్నాళ్లు సోష‌ల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూ ల్లో అనేక వివరణలు ఇచ్చారు మ‌నోజ్‌. అయితే.. నేడు(జూలై 8 శ‌నివారం) బేషరతుగా క్షమాపణలు కోరారు. తాను త‌ప్పు చేసిన‌ట్లు అంగీక‌రించారు.

Salaar : ఆగష్టులో సలార్ ట్రైలర్.. రెడీగా ఉండండి అంటూ అప్డేట్ ఇచ్చిన మూవీ టీం..

ఆదిపురుష్ చిత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్న విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. చేతులు జోడించి వారంద‌రికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. ఆ హ‌నుమంతుడు మ‌న‌ల్ని అంద‌రిని ఐక్యంగా ఉంచి..మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక అని మ‌నోజ్ మంతాషిర్‌ ట్వీట్ చేశారు.

అయితే అత‌డి పోస్ట్ పై నెటీజ‌న్ల నుండి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. క్ష‌మాప‌ణ‌లు కోర‌డం ఇప్ప‌టికే చాలా ఆల‌స్య‌మైంద‌ని చాలా మంది బావిస్తున్నారు. ఇప్ప‌టికి జ్ఞానోద‌య‌మైందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Bro First Single My Dear Markandeya : రెడీగా ఉండండి.. బ్రో నుంచి ఫ‌స్ట్ సింగిల్‌కు టైమ్ ఫిక్స్‌..

ఇదిలా ఉంటే చిత్ర బృందానికి అల‌హాబాద్ హైకోర్టు షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 27 న ఆదిపురుష్ చిత్ర‌ ద‌ర్శ‌కుడు ఓం రౌత్‌, నిర్మాత భూష‌ణ్ కుమార్‌, డైలాగ్ రైట‌ర్ మ‌నోజ్ మంతాషిర్‌లు న్యాయ‌స్థానం ముందు హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. ఈ సినిమా ప్రేక్ష‌కుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిందా లేదా అన్న‌ది స‌మీక్షించి అభిప్రాయాన్ని చెప్పేందుకు ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన ఓ క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని కేంద్రానికి సూచించింది.