Prabhas : ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికే అంటున్న డైరెక్టర్..

లేటెస్ట్ గా ప్రభాస్ ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓమ్ రౌత్ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. రిలీజ్ డేట్ కోసం మీ లాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను..........

Prabhas : ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికే అంటున్న డైరెక్టర్..

New Project

Adipurush :  ఆదిపురుష్ వచ్చేస్తుంది అంటున్నారు ఓమ్ రౌత్. సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఎన్ని కోవిడ్ లు వచ్చినా, ఎన్ని సార్లు లాక్ డౌన్ లు వచ్చినా, ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా షూటింగ్ జరుపుకుంటోంది ఆదిపురుష్. ఆదిపురుష్ కోసం ఇండియా వైడ్ గా అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకూ మాస్, క్లాస్, లవర్ బాయ్, యాక్షన్ హీరో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ప్లే చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని సరికొత్తగా రాముడిగా చూపించబోతున్న విజువల్ వండర్ ఆదిపురుష్ సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇండియా వైడ్ గా ఇంత క్రేజ్ ఉన్న సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా అది పెద్ద హడావిడి చేస్తుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు.

లేటెస్ట్ గా ప్రభాస్ ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓమ్ రౌత్ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. రిలీజ్ డేట్ కోసం మీ లాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉండండి అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లోని ఐమ్యాక్స్ త్రీడీ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఆదిపురుష్ మూవీ.

Balakrishna : అబ్బాయి డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిన బాబాయ్?

రిలీజ్ కి ఇంకా 6 నెలల టైమున్నా ఇప్పటి నుంచే సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నారు ఆదిపురుష్ టీమ్. నిజానికి అనుకున్న టైమ్ కన్నా ముందే షూటింగ్ కంప్లీట్ చేసింది ఆదిపురుష్. ఆగస్ట్ 18, 2020లో సినిమా అనౌన్స్ చేసిన టీమ్ గ్రౌండ్ వర్క్ చేసుకుని ఫిబ్రవరి 2, 2021న సినిమా షూట్ స్టార్ట్ చేశారు. నవంబర్ లోనే షూటింగ్ అయిపోయిందని చెప్పారు. అప్పట్నుంచి గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాని 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించి ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు డైరెక్టర్ ఓం రౌత్.