Aatmanirbhar: ఆత్మనిర్భర్‌లో భాగంగా ఎయిర్ ఫోర్స్ కోసం 96 ఫైటర్ జెట్స్

ఆత్మనిర్భర్ భారత్ పథకానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో, భారత వైమానిక దళం 114 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. వీటిలో 96 యుద్ధ విమానాలను ఇండియాలోనే తయారుచేయాలని అనుకుంటుండగా.. 18 విదేశీ విక్రేతల నుండి దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నారు.

Aatmanirbhar: ఆత్మనిర్భర్‌లో భాగంగా ఎయిర్ ఫోర్స్ కోసం 96 ఫైటర్ జెట్స్

Aatma Nirbhar

Aatmanirbhar: ఆత్మనిర్భర్ భారత్ పథకానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో, భారత వైమానిక దళం 114 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. వీటిలో 96 యుద్ధ విమానాలను ఇండియాలోనే తయారుచేయాలని అనుకుంటుండగా.. 18 విదేశీ విక్రేతల నుండి దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నారు.

‘బై గ్లోబల్ అండ్ మేక్ ఇన్ ఇండియా’ పథకం కింద 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA)ని కొనుగోలు చేసే ప్రణాళికలో ఉంది భారతీయ వైమానిక దళం. భారతీయ కంపెనీలు విదేశీ తయారీదారులతో భాగస్వామ్యం అయి వీటిని తయారుచేస్తారు.

“ఇటీవల, భారత వైమానిక దళం విదేశీ అమ్మకదారులతో సమావేశాలు నిర్వహించి, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ఎలా చేపడుతుందో గురించి అడిగింది” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Read Also: రక్షణ రంగంలోకి ఆత్మ నిర్భర్ భారత్

ప్రణాళిక ప్రకారం.. ముందుగా 18 విమానాలను దిగుమతి చేసుకున్న తర్వాత, తదుపరి 36 విమానాలు దేశంలోనే తయారు చేస్తారు. చివరి 60 విమానాలు అందించడమనేది భారతీయ భాగస్వామి ప్రధాన బాధ్యతని, చెల్లింపులు భారతీయ కరెన్సీలో మాత్రమే జరుగుతాయని వెల్లడించారు.

బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, సాబ్, మిగ్, ఇర్కుట్ కార్పొరేషన్, డస్సాల్ట్ ఏవియేషన్‌తో సహా గ్లోబల్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు టెండర్‌లో పాల్గొంటారని భావిస్తున్నారు.

భారత వైమానిక దళం ప్రత్యర్థులైన పాకిస్తాన్, చైనాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఈ 114 యుద్ధ విమానాలపై ఎక్కువగా ఆధారపడుతుంది.