Delhi Air Pollution : ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు. ఈ అంశంపై రేపు మరోసారి సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.

Delhi Ncr Air Pollution
Air Pollution : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు. ఈ అంశంపై రేపు మరోసారి సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ (ఎన్సీఆర్) నేషనల్ క్యాపిటర్ రీజియన్ పరిధిలో కాలుష్య కట్టడికి చర్యలు చేపట్టినా వాయు కాలుష్యం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. ఢిల్లీ,యుపి,హర్యానా ప్రభుత్వాల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వాయు కాలుష్య కట్టడికి ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ చేసిన ఆదేశాలను ఎన్సీఆర్ రాష్ట్రాలు వారం రోజులుగా అమలు చేస్తున్నాయి.
ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత సగటున 315 పాయింట్లుగా ఉంది. పరిశ్రమలు,వాహనాలు,నిర్మాణాలు,పంట వ్యర్ధాల దహనంతో ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. దీంతో ప్రజలు కళ్ళ మంటలు, గొంతు నొప్పితో ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో పెరిగిన దుమ్ము ధూళి,కాలుష్య కారకాల శాతంతో రోడ్లపై విజబులిటీ తగ్గింది. కొద్ది దూరంలో ఉన్న వాహనాలుకూడా కనిపించటంలేదు.
Also Read : Gas Cylinder Blast : నానక్‌రామ్‌గూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు-11 మందికి గాయాలు
వాయు కాలుష్యం అధికంగా ఉన్నందున ఢిల్లీ-ఎన్సీఆర్ లో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎన్సీఆర్ పరిధిలోకి ట్రక్కుల ప్రవేశం పై నవంబర్ 26 వరకు నిషేదం పొడిగించారు. మరోవైపు ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య కారకాలైన పరిశ్రమలను మూసి వేశారు. నిర్మాణాల కూల్చివేతలను కూడా నిలిపి వేశారు. ఎన్సీఆర్ కి 300 కిమీ పరిధిలోని ఉన్న 6 థర్మల్ పవర్ ప్లాంట్లను ఈ నెలాఖరు వరకు మూసివేశారు.