Nana Patole: అజిత్ పవార్ మా ఎమ్మెల్యేల్ని వేధించాడు: మహా కాంగ్రెస్ అధ్యక్షుడి ఆరోపణ

ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలకంటే ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యం దక్కిందని శివసేన ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎన్సీపీపై ఆరోపణలు చేసింది.

Nana Patole: అజిత్ పవార్ మా ఎమ్మెల్యేల్ని వేధించాడు: మహా కాంగ్రెస్ అధ్యక్షుడి ఆరోపణ

Nana Patole

Nana Patole: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి ముదిరిపోయింది. ఇప్పటివరకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలతోనే సమస్య ఉంటే, ఇప్పుడు ఎంవీఏ (మహా వికాస్ అఘాడి)లోని అంతర్గత కలహాలు నెమ్మదిగా బయటకొస్తున్నాయి. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి ఏర్పాటు చేసిన ఎంవీఏ ప్రభుత్వంలో పార్టీల మధ్య అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి.

Agniveer: అగ్నివీర్‌లకు ఏ ఉద్యోగాలిస్తారు? ఆనంద్ మహీంద్రాకు ఆర్మీ మాజీ ఉద్యోగి ప్రశ్న

ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలకంటే ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యం దక్కిందని శివసేన ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎన్సీపీపై ఆరోపణలు చేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్. గురువారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘అజిత్ పవార్ మా ఎమ్మెల్యేలు, మంత్రుల్ని వేధించాడు. మాకు నిధులు రాకుండా చూశాడు. మేం ఈ ప్రయత్నాల్ని అడ్డుకున్నాం. రాజకీయం కోసం కాదు.. ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం అని చెప్పాం. అయితే, ఈ సమయంలో మేం శివసేన వెంటే ఉంటాం. బీజేపీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే శివసేనతో ఉంటున్నాం.

Spotify: స్పోటిఫైలో కమ్యూనిటీ ఫీచర్

ఒకవేళ శివసేన ఎవరితోనైనా కలవాలి అనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని నానా పటోల్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎన్సీపీపై ఆరోపణలు చేస్తుంటే, తాజాగా నానా పటోల్ చేసిన వ్యాఖ్యలతో వారి వాదనకు మరింత బలం చేకూరినట్లైంది. మహా ప్రభుత్వంలో ఎన్సీపీ ఆధిపత్యం పెరిగిపోయినట్లు స్పష్టమవుతోంది.