Wrestlers vs WFI: దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నా WFI చీఫ్‌పై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు.. బ్రిజ్ భూషణ్ ఎవరు?
Wrestlers vs WFI: బ్రిజ్ భూషణ్ అంత శక్తిమంతుడా? వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు.. బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోనుంది?

Brij Bhushan Singh
Wrestlers vs WFI: దేశాన్ని పాలిస్తున్న బీజేపీలో ఆయనో ఎంపీ. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)కు చీఫ్. కొన్ని రోజులుగా అయనను చూపుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు, ఇతర ప్రముఖులు. ఆయనపైనే టాప్ రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణలు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆయన గురించే చర్చ. ఇంతటి వివాదానికి కారణమయ్యారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh).
కాషాయ పార్టీలో బాహుబలి నేతవంటి వారు బ్రిజ్ భూషణ్ సింగ్. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఆయనకు చాలా పాప్యులారిటీ ఉంది. ఆయన ఒక్కసారి కాదు.. ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. అయిదు సార్లు బీజేపీ నుంచి, 2009లో ఒకసారి సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించారు.
ఆయా సమయాల్లో గోండ్రా, కైసరగంజ్, బలరాంపూర్ నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలోనూ ఆయనకు బాగా పాప్యులారిటీ ఉంది. ఆయన నివాసం గోండా జిల్లాలో ఉంటుంది. యువకుడిగా ఉన్న సమయంలో ఆయనో రెజ్లర్. 1980లో విద్యార్థి సంఘ నాయకుడిగా ఉండి, రాజకీయాల్లోకి ప్రవేశించారు.
హిందుత్వ ఇమేజ్
అయోధ్యలో రామ మందిర ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆయనకు హిందుత్వ ఇమేజ్ వచ్చింది. బాబ్రీ మసీదు కూల్చి వేత కేసులోనూ ఆయన ఉన్నారు. 1991లో ఆయన మొదటిసారి కైసరగంజ్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం, వరుసగా 1999, 2004, 2009, 2014, 2019లో ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో సమాజ్ వాదీ పార్టీ నుంచి గెలుపొందారు. అనంతరం 2014లో మళ్లీ బీజేపీలో చేరి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.
దావూద్ ఇబ్రహీంతో..
దావూద్ ఇబ్రహీం వర్గానికి ఓ నేరంలో సహకరించిన కేసులో 1992లో టెర్రరిస్ట్, డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ (TADA) కింద ఆయన విచారణ ఎదుర్కొని, శిక్ష అనుభవించారు. దీంతో ఆయన 1991 ఎన్నికల తర్వాత 1999 వరకు పోటీ చేయలేదు. ఆయనకు పదుల సంఖ్యలో విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంతటి ప్రాభవం ఉన్న ఆయన బీజేపీకి కావాలి. అలాగే, ఆయనకు బీజేపీ కావాలి.
వచ్చే ఏడాదే లోక్‌సభ ఎన్నికలు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీపై విమర్శలకు కారణమవుతున్న బ్రిజ్ భూషణ్ సింగ్ అంశంపై పార్టీలో సున్నితంగా మారింది. రెజ్లర్ల పోరాటం వల్ల బీజేపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. బ్రిజ్ భూషణ్ కి ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిథ్యనాథ్ కూడా దూరంగానే ఉంటున్నారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. బ్రిజ్ భూషణ్ పై ఇంతగా ఆరోపణలు వస్తున్నా ఇప్పటికీ ఆయనపై బీజేపీ చర్యలు తీసుకోలేదు. ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా తెలియట్లేదు.
Wrestlers vs WFI: మల్లయుద్ధంలోనే కాదు.. ధర్మయుద్ధంలోనూ అదే కసి.. అదే పట్టుదల..
PT Usha: పరుగుల రాణి పీటీ ఉషపై 3 రోజుల నుంచి ఎందుకు మరీ ఇంతలా విమర్శలు?