RRR: బావా.. నువ్వు కుమ్మేశావ్!- అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకు బన్నీ....

RRR: బావా.. నువ్వు కుమ్మేశావ్!- అల్లు అర్జున్

Allu Arjun About Ntr In Rrr

NTR: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకు బన్నీ తనదైన రీతిలో విషెస్ చెబుతూ ఆయా సినిమాలకు తనదైన ప్రమోషన్స్ చేస్తుంటాడు. తాజాగా ఇండియాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేస్తూ రిలీజ్ అయ్యిందో మనం చూశాం. ఈ సినిమా రిలీజ్ రోజునే థియేటర్ల వద్ద ప్రేక్షకులు హంగామా ఓ రేంజ్‌లో ఉంది. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించగా, వారి పర్ఫార్మెన్స్ గురించి బన్నీ తాజాగా ట్వీట్ చేశాడు.

RRR: KilleRRR అంటూ పుష్పరాజ్ కామెంట్!

ముఖ్యంగా తారక్ చేసిన పర్ఫార్మెన్స్ గురించి బన్నీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తారక్-బన్నీ ప్రేమగా ఒకరినొకరు ‘బావా’ అని పిలుచుకుంటారు. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’లో ‘‘బావా నువ్వు కుమ్మేశావ్.. నీ నటన చూస్తుంటే ఓ పవర్ హౌజ్‌ను చూస్తున్నట్లు అనిపించింది’ అని తారక్ పర్ఫార్మెన్స్ గురించి ట్వీట్ చేశాడు బన్నీ.

NTR : డబల్ హ్యాట్రిక్‌తో సరికొత్త రికార్డు సాధించిన ఎన్టీఆర్

ఇలా తారక్ నటన గురించి బన్నీ చేసిన కామెంట్‌ను అటు బన్నీ ఫ్యాన్స్‌తో పాటు తారక్ ఫ్యాన్స్ కూడా వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలతో తారక్ పర్ఫార్మెన్స్ గురించి పలువురు సెలెబ్రిటీలు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తారక్‌ను చూసినంతసేపు తమకు గూస్‌బంప్స్ వచ్చాయని, ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ కితాబిస్తున్నారు. ఇక ఈసినిమా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది.