RRR: KilleRRR అంటూ పుష్పరాజ్ కామెంట్!

దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్ల వద్ద ఎక్కడ చూసినా ఒకటే జనం. అరుపులు, ఈలలు, డ్యాన్సులు, పాలాభిషేకాలతో ఆర్ఆర్ఆర్...

RRR: KilleRRR అంటూ పుష్పరాజ్ కామెంట్!

Allu Arjun Comment On Rrr Movie

RRR: దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్ల వద్ద ఎక్కడ చూసినా ఒకటే జనం. అరుపులు, ఈలలు, డ్యాన్సులు, పాలాభిషేకాలతో ఆర్ఆర్ఆర్ చిత్రం గ్రాండ్ రిలీజ్‌ను ప్రేక్షకులు భారీ స్థాయిలో ఎంజాయ్ చేశారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకు ఊహించినట్టుగానే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సెన్సేషనల్ చిత్రాల దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీలో తారక్, చరణ్‌ల పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు జనం నీరాజనాలు పడుతున్నారు.

RRR : ఢిల్లీ ఏపీ భవన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షోలు

కాగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సైతం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఇదొక ఎపిక్ మూవీ అని పేర్కొనగా, పలువురు స్టార్ డైరెక్టర్స్, హీరోలు ఈ సినిమా గురించి తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. అయితే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్ఆర్ఆర్ చిత్రంపై తనదైన కామెంట్ చేస్తూ ట్వీట్ చేశాడు.

RRR : మాస్టర్ పీస్ అంటూ ‘ఆర్ఆర్ఆర్’పై మెగాస్టార్ ట్వీట్

ఇదొక అద్భుతమైన చిత్రం అని.. ఇలాంటి సినిమాను విజన్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి మరో లెవెల్‌కు తీసుకెళ్లడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారని బన్నీ చెప్పుకొచ్చాడు. ఇండియన్ సినిమా స్థాయిని పెంచే సినిమాగా ఆర్ఆర్ఆర్ వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. ఇక ఇదొక KilleRRR మూవీగా బన్నీ ఈ చిత్రాన్ని అభివర్ణించాడు. మొత్తంగా బన్నీ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.